Homeజాతీయ వార్తలుకరోనా : మరో కొత్త ప్రమాదం

కరోనా : మరో కొత్త ప్రమాదం

COVID 19

కరోనా లాక్ డౌన్ తో ప్రపంచమే బంధీ అయిపోయింది. ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. ఓవైపు వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎవరి ప్రయత్నం వారు చేస్తుండగా.. మరోవైపు వైరస్ తాలూకు దుష్ప్రభావాలు రోజుకో రీతిన బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ చేయగలిగిందీ, చేయాల్సిందీ వైరస్ సోకకుండా చూసుకోవదం మాత్రమే. కాబట్టి మాస్కు తప్పక ధరించండి.. భౌతిక దూరం పాటించండి. మీరు ఆరోగ్యంగా ఉండండి.. సమాజం ఆరోగ్యంగా ఉండడానికి సహకరించండి.

Also Read: కరోనా టీకా కొందరికేనా..?

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో 10 మంది కొవిడ్‌ వ్యాధిగ్రస్తులపై జరిపిన పరిశీలనలో నిపుణులు కొత్త విషయాన్ని గుర్తించారు. ఊపిరితిత్తులను పరీక్షించేందుకు వాడే స్కానింగ్‌ యంత్రాలకు కూడా దొరకని అనేక విషయాలు ఈ పరిశోధనలో బయటపడ్డాయని వైద్యులు వెల్లడించారు. తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో.. కరోనాకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగు చూసింది. కొవిడ్ బారిన పడి మూడు నెలలు గడిచిన తర్వాత కూడా.. ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం చూపుతోందని తేలింది. 19 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్కులైన 10 మంది కొవిడ్‌ పేషెంట్లను ఈ పరిశోధనకు ఎంచుకున్నారు. ప్రొఫెసర్‌ ఫెర్గస్‌ గ్లీసన్‌ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన జరిపింది. ఈ పది మంది వ్యాధి గ్రస్తుల్లో.. ఎనిమిది మంది దాదాపు మూడు నెలల పాటు శ్వాస సంబంధమైన సమస్యలతోపాటు, అలసట వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు నిపుణులు గుర్తించారు.

ఈ పరిశీలన కోసం ఊపిరితిత్తులకు ఎంఆర్ఐ స్కానింగ్‌ చేసే సమయంలో “జెనాన్‌” అనే గ్యాస్‌ను ఉపయోగించారు. ఈ స్కానింగ్‌ ద్వారానే కొవిడ్‌ పేషెంట్ల ఊపిరితిత్తులలో దీర్ఘకాలం కొనసాగడానికి అవకాశం ఉన్న సమస్యలు కనిపించాయని నిపుణులు వెల్లడించారు. కరోనా సోకడానికి ముంద వీరిలో ఎవరికీ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం గానీ, వెంటిలేషన్‌ మీద ఉండాల్సిన పరిస్థితి గానీ రాలేదని తెలిపారు. అంతేకాదు.. వీరికి మొదట నిర్వహించిన సాధారణ స్కాన్‌లో ఏ సమస్యా లేదని తేలడం గమనార్హం. కొవిడ్‌ వైరస్‌ వెలుగు చూసి ఏడాది గడిచింది.

Also Read: హాట్ టాపిక్.. జాతీయగీతం మారబోతుందా?

కొవిడ్‌ కారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో మరణాలు ఎక్కువగా ఉన్నాయని, తమ పరిశోధనలో ఊపిరితిత్తుల సమస్య ఇంకా ఎక్కువ స్థాయిలో ఉందని తేలితే మాత్రం.. ఇప్పటి వరకు అనుసరిస్తున్న వైద్య విధానాల పద్ధతులను చాలా వరకు మార్చుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్‌ గ్లీసన్‌ చెప్పారు. ఈ ఫలితాల కోసం తాము మరో 100 మందిపై పరిశోధనలు జరపనున్నట్టు చెప్పారు. నెలక్రితం వరకు కాస్త తగ్గుముఖం పట్టినా కేసుల సంఖ్య.. “సెకండ్ వేవ్” విజృంభణతో రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గత శనివారం ఒక్కరోజే ప్రపంచం మొత్తం మీద 6 లక్షల 3 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.. పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ సెకండ్ వేవ్ దెబ్బకు వణికిపోతున్నాయి. మానవాళికే సవాల్ విసురుతున్న ఈ వైరస్ నివారణకు పూర్తి స్థాయి వ్యాక్సిన్ సంగతి అటుంచితే.. అసలు ఇప్పటి వరకు వ్యాధి తీవ్రత ఎంత? ఎవరి మీద ఎలా పనిచేస్తుంది? ఎంతకాలం ప్రభావం చూపుతుంది? అనే విషయం కూడా అంతు చిక్కలేదు. వ్యాధి గ్రస్తుల రక్తంలో ఆక్సిజన్‌ సరైన పరిమాణంలో కలవడం లేదని గుర్తించారు. అంతే కాకుండా.. ఈ మూడు నెలల్లో కొన్నాళ్లు శ్వాస సంబంధమైన సమస్యను ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ పరిశోధన ద్వారా.. కొవిడ్‌ పేషెంట్లలో ఊపిరితిత్తులు ఎంతవరకు చెడిపోతాయి అనే విషయం తెలుసుకోవడమే తమ లక్ష్యమని, ప్రొఫెసర్‌ గ్లీసమ్‌ వెల్లడించారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version