https://oktelugu.com/

వైరల్: జీహెచ్ఎంసీపై బీజేపీ ఓపెన్ ఆఫర్

దుబ్బాకలో గెలుపుతో బీజేపీ నూతనోత్సాహంతో గ్రేటర్‌‌ ఎన్నికలకు ప్రిపేర్‌‌ అవుతోంది. ఇప్పటికే అధికార పార్టీ దాదాపు సిట్టింగ్‌ కార్పొరేటర్లకు సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడగా.. బీజేపీ కూడా అభ్యర్థుల వేటలో పడింది. ఇందులో భాగంగా బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారు తమ బయోడేటాలను ఇవ్వాలని కోరుతోంది. Also Read: నవ్విపోదురుగాక: గ్రేటర్‌‌లో పోటీకి తొడగొట్టిన టీడీపీ! నేటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఆశావాహుల నుంచి ఆయా జిల్లాల అధ్యక్షులు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 3:45 pm
    Follow us on

    BJP

    దుబ్బాకలో గెలుపుతో బీజేపీ నూతనోత్సాహంతో గ్రేటర్‌‌ ఎన్నికలకు ప్రిపేర్‌‌ అవుతోంది. ఇప్పటికే అధికార పార్టీ దాదాపు సిట్టింగ్‌ కార్పొరేటర్లకు సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడగా.. బీజేపీ కూడా అభ్యర్థుల వేటలో పడింది. ఇందులో భాగంగా బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారు తమ బయోడేటాలను ఇవ్వాలని కోరుతోంది.

    Also Read: నవ్విపోదురుగాక: గ్రేటర్‌‌లో పోటీకి తొడగొట్టిన టీడీపీ!

    నేటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఆశావాహుల నుంచి ఆయా జిల్లాల అధ్యక్షులు బయోడేటాలు తీసుకోనున్నారు. గ్రేటర్ పరిధిలో ఆరుగురు అధ్యక్షులను బీజేపీ నియమించింది. డివిజన్లు వారీగా అభ్యర్థుల పనితీరుపై రాష్ట్ర నాయకత్వం సర్వే చేయించనుంది. సర్వేలో ముందు వరుసలో ఉన్న వారికే టికెట్లు ఇస్తామని బీజేపీ చెబుతోంది. ఇదిలా ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్‌లో కాషాయం జెండా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చాటాలని అనుకుంటోంది.

    Also Read: తెలంగాణ సర్కార్‌‌ ముందస్తు తాయిలాల కథ ఇదీ!

    ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించేసింది. అందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీ నూతన ఇన్‌చార్జీలను నియమించింది. ఆ మేరకు ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. దాని ప్రకారం.. బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ భూపేంద్ర యాదవ్‌ను జీహెచ్‌ఎంసీ ఎన్నికల పార్టీ ప్రధాన ఇన్‌‌చార్జిగా నియమించింది. కర్ణాటక ఆరోగ్యశాఖ, వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్‌ను డిప్యూటీ ఇన్‌చార్జిగా నియమించారు. వీరితోపాటు ఈ బృందంలో మహారాష్ట్రకు చెందిన ఆశిష్ శెల్లార్, గుజరాత్‌కు చెందిన ప్రదీప్ సింహ్, కర్ణాటకకు చెందిన సతీశ్ రెడ్డి కూడా ఉన్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అధికార టీఆర్‌‌ఎస్‌ను సమర్థంగా ఢీకొంటుందన చెప్పారు. పోరాట పటిమతో దూసుకెళుతున్న నాయకత్వం మొన్నటి దుబ్బాక ఎన్నిక ద్వారా యువత, పల్లె ఓటరుకు మరింత చేరువైందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. మొత్తంగా ఈ గ్రేటర్‌‌ ఎన్నికల్లో వినూత్నంగా క్యాండిడేట్లను బరిలోకి దింపి.. మరోసారి తమ సత్తా చాటాలని చూస్తోంది.