https://oktelugu.com/

కాంగ్రెస్ కు షాక్.. గ్రేటర్ లో బీజేపీ తరుఫున విజయశాంతి ప్రచారం

తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొంతకాలంగా విజయశాంతి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. బీజేపీ పెద్దలు ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారు. మూడు సార్లు కలిసి మాట్లాడారు. కేంద్రహోంమంత్రి కిషన్ రెడ్డి ఒకసారి..అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు సార్లు సమావేశమయ్యారు. ఆమెను బీజేపీలో చేరేలా ఒప్పించారు. Also Read: బీజేపీ ఆకర్ష్‌ కు కాంగ్రెస్ ఖాళీయేనా? ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2020 / 12:13 PM IST
    Follow us on

    తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొంతకాలంగా విజయశాంతి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
    బీజేపీ పెద్దలు ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారు. మూడు సార్లు కలిసి మాట్లాడారు. కేంద్రహోంమంత్రి కిషన్ రెడ్డి ఒకసారి..అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు సార్లు సమావేశమయ్యారు. ఆమెను బీజేపీలో చేరేలా ఒప్పించారు.

    Also Read: బీజేపీ ఆకర్ష్‌ కు కాంగ్రెస్ ఖాళీయేనా?

    ఈ క్రమంలోనే విజయశాంతి బీజేపీలో చేరికకు రేపే ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. విజయశాంతి మంగళవారం ఢిల్లీ వెళుతున్నట్టు తెలుస్తోంది. అక్కడే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డీ సమక్షంలో బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆమె గ్రేటర్ లో బీజేపీ తరుఫున ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

    దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం కూడా విజయశాంతిని ఆకర్షించిందని ఆమెను బీజేపీలో చేరేలా ప్రోత్సహించిందన్న టాక్ ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అయ్యాక ఆయన దూకుడు వైఖరి విజయశాంతికి బాగా నచ్చిందని.. కేసీఆర్ సర్కార్ ను బండి ఎదుర్కొంటున్న తీరుకు ఆనందంగా ఉందని.. అందుకే ఇలాంటి పార్టీలో ఉండాలని విజయశాంతి కోరుకుంటున్నట్టు తెలిసింది.

    Also Read: కేసీఆర్ ట్విస్ట్.. మేనిఫెస్టోలో ‘ఫిల్మ్ సిటీ’..!

    మరోవైపు విజయశాంతి గొప్ప నాయకురాలని.. తెలంగాణ మిగతా ఉద్యమకారుల్లాగానే ఆమెకు కేసీఆర్ అన్యాయం చేశారని బండి సంజయ్ ఆరోపించడం విశేషంగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    బీజేపీలో చేరిన అనంతరం రాములమ్మ బీజేపీ తరుఫున జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్టు తెలిసింది. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అనడంలో ఎలాంటి సందేహం లేదు.