బాబు ఆదేశాలు బేఖాతరు…!

తెలుగుదేశం పార్టీలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపు అంశం దుమారాన్ని రేపుతోంది. ఈ అంశంపై టీడీపీ ఇంత వరకు తన వైఖరిని వ్యక్తం చేయలేదు. పోతిరెడ్డిపాడుపై మాట్లాడవద్దని పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కావాలనే జగన్, కేసీఆర్ ఈ వ్యవహారాన్ని ఎప్పుడు తెరపైకి తెచ్చారనే వాదనను ఆ పార్టీ వినిపిస్తోంది. కరోనా, విశాఖ దుర్ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ నాటకం ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. పోతిరెడ్డిపాడు […]

Written By: Neelambaram, Updated On : May 18, 2020 8:05 pm
Follow us on


తెలుగుదేశం పార్టీలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపు అంశం దుమారాన్ని రేపుతోంది. ఈ అంశంపై టీడీపీ ఇంత వరకు తన వైఖరిని వ్యక్తం చేయలేదు. పోతిరెడ్డిపాడుపై మాట్లాడవద్దని పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కావాలనే జగన్, కేసీఆర్ ఈ వ్యవహారాన్ని ఎప్పుడు తెరపైకి తెచ్చారనే వాదనను ఆ పార్టీ వినిపిస్తోంది. కరోనా, విశాఖ దుర్ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ నాటకం ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో కొంత కాలం వేచి చూసే ధోరణి అవలంభించాలని టీడీపీ నాయకులకు సూచించారు

అధికార పక్షం వైసీపీ టీడీపీని ఈ లాగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా సమావేశాల్లో టీడీపీ వైఖరి ఏంటని ప్రశ్నిస్తుంటే, ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ సోషల్ మీడియాలో అదే పనిలో ఉంది. అయినప్పటికీ టీడీపీ నేతలు పోతిరెడ్డిపాడుపై నోరువిప్పడం లేదు.

రాయలసీమ నాయకులు అధినేత వైఖరి విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పోతిరెడ్డిపాడుపై ఎటువంటి ప్రకటన చేయకుండా తాత్సారం చేయడంవల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, సీమ ప్రజలకు దూరమై పార్టీ మరింత నష్టపోవాల్సి వస్తుంది ఆ ప్రాంత నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఇతర పార్టీల వలె రాయలసీమకు నీళ్లు నీళ్లు ఇవ్వాల్సిందేనని స్పష్టమైన వైఖరి తెలియజేయటమే సరైన నిర్ణయం అవుతుందని అంటున్నారు.

ఈ విషయంలో ఇతర నేతల్లా అంతర్మధనం చెందకుండా టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ విషయంలో కొంత చొరవ తీసుకుని ఆయన వైఖరిని స్పష్టం చేశారు. ప్రభుత్వం తెచ్చిన జిఓ 203కు తన మద్దతును తెలుపుతూనే, గట్టి హెచ్చరికలు చేశారు. ఎట్టి పరిస్థితులలో రాయలసీమ నీటి హక్కుల విషయంలో తెలంగాణతో రాజీ పడితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీ వ్యాపారం కోసం రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దని జగన్ కు హితవు పలికారు. ఇది అధిష్టానంపై అసంతృప్తికి నాంధిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పోతిరెడ్డిపాడు వ్యవహారంలో టీడీపీ ఇరకాటంలో పడినట్లు అయ్యింది.