Vijay CM Convoy: అప్పట్లో ఎన్.శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా ఒకే ఒక్కడు సినిమా ఎంతటి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఈ సినిమా స్క్రిప్ట్ ముందుగానే విజయ్ దగ్గరికి వచ్చింది.. కానీ అనివార్య కారణాలవల్ల విజయ్ ఆ సినిమా చేయలేకపోయారు.. సినిమాల్లో ఒకరోజు గా సీఎం గా ఉండే అవకాశాన్ని ఆయన కోల్పోయినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం ముఖ్యమంత్రిగా వ్యవహరించే అవకాశాన్ని ఆయన సొంతం చేసుకున్నారు.
విజయ్ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే గవర్నర్ నుంచి ఆమోదముద్ర లభించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పాటు.. కొన్ని పార్టీలు ఆయనకు సపోర్ట్ చేస్తాయని తెలుస్తోంది. అన్న డీఎంకే లోను మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనకు జై కొడుతున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే తమిళనాడు రాజకీయాలలో ఆయన సమూల మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారంలో.. అంతకుముందు జరిగిన పార్టీ కార్యక్రమాలలో ఎక్కడా కూడా నోరు జారలేదు. అప్పటి అధికార డిఎంకె మీద.. ప్రతిపక్ష అన్న డిఎంకె మీద విమర్శలు చేయలేదు. రాజకీయాలు అంటే హుందాగా ఉండాలి అనేది విజయ్ అభిప్రాయం. అందువల్లే ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా తాను ఏం చేస్తానో మాత్రమే చెప్పాడు. అంటే తప్ప విమర్శల జోలికి పోలేదు.
ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాలలో విజయ్ పార్టీ భారీగా స్థానాలను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ మూడు అంచల విధానంలో బందోబస్తు కొనసాగుతోంది.. ఆయన నివాసం వద్ద కూడా పోలీసులు ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు.
బుధవారం తమిళనాడు గవర్నర్ ను కలవడానికి విజయ్ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం సెక్యూరిటీ కాన్వాయ్ ఏర్పాటు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఈ స్థాయిలో కాన్వాయ్ ఏర్పాటు చేయడం విశేషం. అప్పట్లో సినిమాలలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా నటించే అవకాశాన్ని విజయ్ కోల్పోయారు. ఇప్పుడు నిజ జీవితంలో ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ స్థాపించిన తొలినాళ్లలోనే ఆయన అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. సీఎం సెక్యూరిటీ కాన్వాయ్ తో విజయ్ ఇచ్చిన మాస్ ఎంట్రీ సినిమాలను మించిపోయిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Tamilaga Vettri Kazhagam (TVK) President C. Joseph Vijay arrived at Lok Bhavan in Chennai to meet Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar and stake claim to form the government.#TVKVijay #TVK #Vijay #Tamilnadu pic.twitter.com/0SC58LMi2q
— Surya Reddy (@jsuryareddy) May 6, 2026