ఉప రాష్ట్రపతి దృష్టికి పైలాన్ వివాదం!

నెల్లూరు జిల్లా కావలిలో అమృత్ పథకం పైలాన్ ధ్వంసం చేసిన సంఘటన వివాదాస్పదమయ్యింది. కావాలిలోని ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఉన్న ఈ పైలాన్ కావాలనే అధికార పార్టీకి చెందిన వారు ధ్వంసం చేశారాని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హస్తం ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన ఈ పైలాన్ ను మాజీ మంత్రి లోకేష్ 2018లో ఆవిష్కరించారు. పైలాన్ నిర్మించిన ప్రదేశంలో ప్రెస్ క్లబ్ నిర్మిస్తారని సమాచారం. ఈ […]

Written By: Neelambaram, Updated On : April 14, 2020 6:27 pm
Follow us on


నెల్లూరు జిల్లా కావలిలో అమృత్ పథకం పైలాన్ ధ్వంసం చేసిన సంఘటన వివాదాస్పదమయ్యింది. కావాలిలోని ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఉన్న ఈ పైలాన్ కావాలనే అధికార పార్టీకి చెందిన వారు ధ్వంసం చేశారాని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హస్తం ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన ఈ పైలాన్ ను మాజీ మంత్రి లోకేష్ 2018లో ఆవిష్కరించారు. పైలాన్ నిర్మించిన ప్రదేశంలో ప్రెస్ క్లబ్ నిర్మిస్తారని సమాచారం. ఈ సంఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఈ సంఘటనపై సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కి లేఖ రాశారు. బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వివాదాన్ని స్థానిక నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకు వెళ్లారు. చట్టం అధికారులు చర్యలు తీసుకుంటారని ఉపరాష్ట్రపతి బీజేపీ నేతలకు సూచించారు. వివాదాలకు పోవద్దని హితవు పాలికినట్లు తెలిసింది. మరోవైపు కూల్చివేత వివాదం ఉపరాష్ట్రపతి దృష్టికి వెళ్లడంతో ఇందుకు సహకరించిన అధికారుల్లో ఆందోళన మొదలైంది.

అటు జిల్లా అధికారులకు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. పైలాన్ మళ్లీ నిర్మాస్తామంటూ వైసీపీ నాయకులు రాయబారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కావలిలో అధికార పక్షం నాయకులు చేసిన పని వివాదాస్పదం అయ్యింది.