
కరోనా విపత్తు మనుషుల ఆలోచన లో సరికొత్త మార్పు తీసుకొచ్చింది . తరచి చూడటం అలవాటౌతోంది. దరిమిలా నేను సైతం అంటూ ఈ ఆపత్సమయం లో ముందుకు రావడం జరుగుతోంది తాజాగా కేరళలో ఒక సినీ హీరోయిన్ ప్రజలకు సేవ చేస్తానంటూ ముందుకొచ్చింది. యంగ్ హీరోయిన్ నిఖిల విమల్ కేరళ ప్రభుత్వం చేపడుతున్న కరోనా సహాయక చర్యలకు తనవంతుగా సేవ లందిస్తోంది. కేరళ లో కరోనా రక్షణ పరికరాలు, నిత్యావసరాలు అందించే విషయం లో ప్రభుత్వ కాల్ సెంటర్ లో ప్రజలకు అనుసంధాన కర్తగా వ్యవహరిస్తోంది. అలా ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు తన గొంతు ద్వారా వినిపిస్తూ సేవలు అందిస్తోంది.
కేరళ లోని తలిపారంబ కి చెందిన నిఖిల విమల్ తమ సమీప కన్నూర్ పట్టణం లోని కాల్ సెంటర్ లో ఈ విధమైన ప్రజా సేవ చేస్తూ లాక్ డౌన్ టైంని సద్వినియోగం చేస్తోంది ఇంతకీ ఈ నిఖిల విమల్ ఎవరంటే 2017 లో తెలుగులో నరేష్ హీరోగా వచ్చిన ` మేడ మీద అబ్బాయి ` చిత్రంలో హీరోయిన్ గా నటించింది . ఆ తరవాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన ` గాయత్రీ ` చిత్రంలో కూడా నటించింది . .