Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఏ రోజుకారోజు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అచ్చం సినిమా కథనంలా పలు విషయాల్లో అనేక కోణాల్లో కేసు పురోగతి ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు సీబీఐ సేకరించిన సాక్ష్యాలు వట్టివేనని మరో బాంబు పేల్చారు. దీంతో కేసు కలకలం రేపుతోంది. కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్న తరుణంలో మళ్లీ మొదటికి వస్తోంది.
ఈ నేపథ్యంలో వివేకా కుమర్తె సునీతా రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో హత్య కేసు సీబీఐకి అప్పగిస్తే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతారనే విషయం చెప్పారని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కేసులో సునీత తనను ప్రలోభాలకు గురి చేసిందని గంగాధర్ రెడ్డి వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. దీంతో కేసు ఇంకా ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు.
దీంతో కేసులో అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల పేర్లు చేర్చాలని తనపై ఒత్తిడి చేసినట్లు చెబుతున్నారు. పైగా తనకు రూ.20 వేలు ఇచ్చినట్లు వెల్లడించారు. పైగా తన కాలు శస్త్ర చికిత్స కు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని చెప్పి తప్పులు సాక్ష్యాలు చెప్పించినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నాడు దీంతో వివేకా కేసు ఇంకా ఎటు వైపు వెళ్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
మొత్తానికి వివేకా హత్య కేసులో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో తెలియడం లేదు. కేసులో ఆ ముగ్గురు పేర్లు సూచించాలని చెబుతూ తనను ఇబ్బందులకు గురి చేశారని గంగాధర్ రెడ్డి చెప్పడం సంచలనం రేపుతోంది. దీంతో కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. భవిష్యత్ లో ఇంకా ఎందరు నిందితులుగా చేరతారో కూడా తెలియడం లేదు. కానీ వివేకా హత్య కేసు ఇప్పట్లో ముగియడం మాత్రం కుదరదని చెబుతున్నారు.