ABN RK- Chandrababu: వేమూరి రాధాకృష్ణ దృష్టిలో రాజకీయ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు. పార్టీ అంటే తెలుగుదేశం.. అంతే అంతకుమించి ఏమీ ఉండదు. కానీ ఈ స్థాయిలో డప్పులు కొట్టినా, జర్నలిజం ముసుగులో పసుపు రంగు వేసుకుని పోతురాజు మాదిరి జబ్బలు చరుచుకున్నా చంద్రబాబు ఇతర పార్టీల పొత్తు లేకుండా ఒకసారి కూడా సొంతంగా అధికారంలోకి రాలేదు.. కానీ ఇవేమీ రాధాకృష్ణకు కనపడవు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టించాడనే తాటాకు చప్పుళ్ళ వార్తలకైతే కొదవ ఉండదు. ఎల్లో క్యాంపు పేపర్ అని జనాలు ముద్ర వేసినప్పటికీ రాధాకృష్ణకు అవేమీ వినిపించవు.

నవ్వి పోదురు గాక..
ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి ఆంధ్రజ్యోతి టార్గెటె డ్ గా వార్తలు రాస్తోంది..” ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని.. అరాచకం జరుగుతోందని… వృద్ది మందగించిందని” రకరకాల కోణాల్లో వార్తలు రాసింది. రాస్తూనే ఉంది. ఇక పై రాస్తూనే ఉంటుంది.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేదాకా తన ఎల్లో యజ్ఞాన్ని అది ఆపదు.. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగిపోయిందనే విషయంలో మాత్రం కొంత నిజం ఉన్నప్పటికీ… ఆంధ్రజ్యోతి రాసే తీరు మాత్రం వాస్తవానికి భిన్నంగా ఉంటుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటైనప్పుడు ఇలాగే వార్తలు రాసింది.. చిరంజీవిపై లేనిపోని అసత్యాలు ప్రచురించింది. జనసేన ఏర్పాటైనప్పుడు కూడా… ఇలానే వ్యవహరించింది. చంద్రబాబుకు మద్దతు ఇచ్చినప్పుడు ఆకాశానికి ఎత్తిన ఆంధ్రజ్యోతి… ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పై లేనిపోని కథనాలు వండి వార్చింది.. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ను దెబ్బకొట్టేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రేణు దేశాయ్ తో ఇంటర్వ్యూ చేశారు.. ఆమె చెప్పింది ఒకటైతే వీరు చంద్రబాబుకు అనుకూలంగా మలిచారు. చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ను పైకి లేపేందుకు ఆంధ్రజ్యోతి వాడని జాకీలు అంటూ లేవు.
26 వేల కోట్ల వసూళ్లు
జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి ఇప్పటివరకు పైసా అభివృద్ధి జరగలేదని రాధాకృష్ణ ఉవాచ. అతని పేపర్లో ప్రచురితమయ్యే కథనాలు కూడా అలానే ఉంటాయి. ఆంధ్రజ్యోతి కి మించి సాక్షిలో ఉద్దండలైన జర్నలిస్టులు ఉన్నప్పటికీ జగన్ కు ఎలా పని చేయాలో, ఆ ఎల్లో మీడియాను ఎలా అడ్డు కావాలో తెలియదు.. సరే ఇదంతా వేరే విషయం. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జిఎస్టి వసూలు 26 వేల కోట్లకు చేరాయి.. దీన్ని ఆంధ్రజ్యోతే ప్రచురించింది.. పరిశ్రమలు ఏర్పాటు కాకుండా, కొత్త ఉద్యోగాలు ఏర్పాటు కాకుండా ఇదంతా సాధ్యమేనా అనే ప్రశ్నకు ఆంధ్ర జ్యోతి వద్ద సమాధానం ఉండదు. ఎందుకంటే దానికి అస్తమానం చంద్రబాబు మీదే యావ.. ఇప్పుడు సమయానికి జీతాలు రావడం లేదు, పింఛన్లు రావడం లేదు అని గగ్గోలు పెట్టే ఆంధ్రజ్యోతి… అదే చంద్రబాబు పాలనలో ఇతర సంక్షేమ పథకాలకు నగదు పంపిణీలో జాప్యం అయిన విషయం మాత్రం మర్చిపోతుంది. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అభివృద్ధిలో పెద్దగా చేసింది ఏమీ లేదు.

కానీ ఉద్యోగులకు ఒకటో తారీఖు నాడు మాత్రమే జీతాలు ఇచ్చేవారు.. మిగతా పథకాల్లో కోతలు పెట్టేవారు.. అప్పట్లో డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు… తర్వాత ఆ మాటే మర్చిపోయారు. ఇక తాను అధికారంలోకి వచ్చేందుకు నవరత్నాలు అనే పథకాలకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి… మొదట్లో అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లా ప్రజలకు పంచిపెట్టారు. తర్వాత ఆదాయం, ఖర్చుకు తేడా భారీగా ఉండటంతో… ఆ పథకాల విషయంలో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నారు.. ఇక తాజాగా పెరిగిన జీఎస్టీ వసూళ్ళు వార్తను రాసిన ఆంధ్రజ్యోతి వ్యవహారం నవిపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉంది.