https://oktelugu.com/

Varun Singh: విషాదం.. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదివరకు పోరాడిన వీరుడు?

Varun Singh: శౌర్య చక్ర అవార్డు గ్రహీత, కెప్టెన్ వరుణ్ సింగ్ కాసేపటికి క్రితమే తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వరుణ్ సింగ్ ను ఆర్మీ అధికారులు బెంగూళూరు కమాండ్ ఆస్పత్రికి తరలించారు. నాటి నుంచి మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్ కోలుకుంటాడని అంతా భావించారు. అయితే కాసేపటి క్రితమే ఆయన మృతిచెందిన ఆర్మీ అధికారులు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా విషాదచాయలు నెలకొన్నాయి. త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2021 / 02:33 PM IST
    Follow us on

    Varun Singh: శౌర్య చక్ర అవార్డు గ్రహీత, కెప్టెన్ వరుణ్ సింగ్ కాసేపటికి క్రితమే తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వరుణ్ సింగ్ ను ఆర్మీ అధికారులు బెంగూళూరు కమాండ్ ఆస్పత్రికి తరలించారు. నాటి నుంచి మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్ కోలుకుంటాడని అంతా భావించారు. అయితే కాసేపటి క్రితమే ఆయన మృతిచెందిన ఆర్మీ అధికారులు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా విషాదచాయలు నెలకొన్నాయి.

    Varun Singh

    త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ డిసెంబర్ 8న ఆర్మీ హెలిక్టాప్టర్ లో తమిళనాడు సూలూర్​ ఎయిర్​బేస్​ నుంచి వెల్లింగ్టన్​లోని సైనిక కళాశాలకు వెళుతున్నారు. మధ్యాహ్నం ఆయన కళాశాలలో ప్రసంగించాల్సి ఉండగా అనుహ్యంగా హెలికాప్టర్ ప్రమాదానికి గురై కుప్పకూలిపోయింది. భారీగా మంటలు చెలరేగి పలువురు అక్కడికక్కడే మృత్యువాత పడటం శోచనీయంగా మారింది.

    ఈ దుర్ఘటనలో సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ తోపాటు ఆయన భార్య మధులిక, మరో 11మంది ​ఆర్మీ సిబ్బంది, అధికారులు మృత్యువాతపడ్డారు. వీరిని గుర్తుపట్టలేనంతా శరీరాలు కాలిపోయాయి. దీంతో మృతదేహాలకు డీఎన్ఎ టెస్టులు నిర్వహించిన బంధువులకు మృతదేహాలను అప్పగించి ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

    ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్క వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. తాజాగా ఆయన సైతం మృతి చెందడంతో ఈ ప్రమాదంలో మృతిచెందిన సంఖ్య 14కు చేరింది. ఆర్మీ హెలికాప్టర్ లో మొత్తం 14మంది ప్రయాణించి అధికారులు చెబుతుండగా అందరూ చనిపోవడం విషాదాన్ని మిగిల్చింది. కాగా వరుణ్ గతంలోనూ ఓసారి మృత్యుఒడిలోకి వెళ్లి క్షేమంగా బయటపడ్డారు.

    Also Read: కెన్యాలో దుర్భిక్ష పరిస్థితులు.. ఎక్కడ చూసినా జంతువుల కళేబరాలే..?

    గతేడాది అక్టోబర్​లో వరుణ్ సింగ్ నడుపుతున్న తేజస్​ విమానంలో గాలిలో ఉన్న సమయంలోనే అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో వరుణ్​ విమానం నుంచి దూకి ప్రాణాలను రక్షించుకోవచ్చు. అయితే ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించి, సమయస్ఫూర్తితో విమానాన్ని నడిపి సురక్షితంగా నేలపైకి తీసుకొచ్చారు.

    వరుణ్​ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులోనే శౌర్య చక్రతో వరుణ్ ను సత్కరించింది. ఇదిలా ఉంటే వరుణ్​ సింగ్​ తండ్రి సైతం ఏఏడీ(ఆర్మీ ఎయిర్​ డిఫెన్స్​)లో విధులు నిర్వహించారు. వరుణ్​ సోదరుడు తనూజ్ ప్రస్తుతం నేవీలో లెఫ్టినెంట్​ కమాండర్​గా పని చేస్తున్నారు.

    Also Read: మోడీతో నేరుగా మట్లాడే ఛాన్స్.. వాస్తవ పరిస్థితి చెబుతారా?