https://oktelugu.com/

RGV Shocking Comments: ఇంపాజిబుల్ సిచ్యువేషన్స్‌లో పోర్న్ చూస్తా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

RGV Shocking Comments: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసే ప్రతీ పని కాంట్రవర్సియల్ అవుతుంటుంది. దాంతో పబ్లిసిటీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంటుంది. ఇకపోతే చాలా విషయాలపై వర్మ తనదైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో పలు విషయాలపైన ఆయనతో ముచ్చటిస్తూ ‘రాము ఇజం’ అనే చర్చ చేశారు. తాజాగా ‘వర్రీ’కి సంబంధించి ‘రాముఇజం’ ఎపిసోడ్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో విడుదల కాగా, అది సోషల్ […]

Written By: , Updated On : December 15, 2021 / 02:48 PM IST
Follow us on

RGV Shocking Comments: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసే ప్రతీ పని కాంట్రవర్సియల్ అవుతుంటుంది. దాంతో పబ్లిసిటీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంటుంది. ఇకపోతే చాలా విషయాలపై వర్మ తనదైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో పలు విషయాలపైన ఆయనతో ముచ్చటిస్తూ ‘రాము ఇజం’ అనే చర్చ చేశారు. తాజాగా ‘వర్రీ’కి సంబంధించి ‘రాముఇజం’ ఎపిసోడ్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో విడుదల కాగా, అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

RGV

RGV

Ram Gopal Varma : పని లేని వాళ్లకే ‘వర్రీ’స్ ఉంటాయన్న ఆర్జీవీ..
‘రాముఇజం’ అనే చర్చను స్టార్ట్ చేసి గతంలో పలు విషయాలపై ఆర్జీవీతో ముచ్చటించిన జర్నలిస్టు స్వప్న.. తాజాగా మరోసారి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. ఈ సారి ‘వర్రీ’ అనే విషయంపై ఫోకస్ చేసి.. అసలు వర్రీస్ ఎందుకు వస్తుంటాయి, అవి రాకుండా ఏం చేయాలి., ఈ విషయాలపై ఆర్జీవీ ఎలా ఆలోచిస్తారు అనే సంగతి తెలుసుకునేందుకుగాను ఇంటర్వ్యూ చేసింది. ఇక ఇంటర్వ్యూలో ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. పని లేని వాళ్లకు వర్రీ చాలా పెద్ద టైం పాసని ఈ సందర్భంగా వివరించారు వర్మ. వర్రీ అనేది మనల్ని సర్కస్‌లో పెడుతుందని, థింకింగ్ అనేది సొల్యూషన్ ఇస్తుందని చెప్పారు.

Also Read: Actress Pragathi: నాగిని పాటకు స్టెప్పులు ఇరగదీసిన నటి ప్రగతి… ఫిదా అవుతున్న కుర్రకారు

ఈ క్రమంలోనే వర్మ వర్రీ గురించి చెప్పేందుకుగాను తన జీవితంలో జరిగిన సందర్భాలను షేర్ చేసుకున్నాడు. ‘అంతం’ సినిమా సమయంలో ఇతరులు పడ్డ వర్రీస్ గురించి తెలిపాడు. ఈ నేపథ్యంలోనే కాంప్లెక్స్ సిచ్యువేషన్స్.. ఇంపాజిబుల్ పరిస్థితులు తనకు ఎదురైతే అప్పుడు పోర్న్ చూస్తానని చెప్పాడు ఆర్జీవీ.. డైరెక్టర్ అలా చెప్పగానే జర్నలిస్టు స్వప్న ‘మళ్లీ అక్కడకే వచ్చార’ని అంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్స్‌లో వర్మీకి మూలం ఇన్ సెక్యూరిటని తెలిపాడు రామ్ గోపాల్ వర్మ. తన కంట్రోల్‌లో లేని విషయాల గురించి తాను అస్సలు ఆలోచించబోనని ఈ సందర్భంగా ఆర్జీవీ పేర్కొన్నాడు.

Also Read: Tollywood: టికెట్ రేటు విషయంలో హైకోర్టు తీర్పుపై… డివిజనల్ బెంచ్ లో పిటిసన్ వేసిన ఏపీ సర్కారు

Tags