https://oktelugu.com/

Actress Pragathi: నాగిని పాటకు స్టెప్పులు ఇరగదీసిన నటి ప్రగతి… ఫిదా అవుతున్న కుర్రకారు

Actress Pragathi: తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి. అత్త, తల్లి పాత్రలు చేస్తూ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంతో పేరు సంపాదించడంతో పాటు సోషల్ మీడియాలో కూడా నటి ప్రగతి కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రగతి సోషల్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 02:19 PM IST
    Follow us on

    Actress Pragathi: తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి. అత్త, తల్లి పాత్రలు చేస్తూ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంతో పేరు సంపాదించడంతో పాటు సోషల్ మీడియాలో కూడా నటి ప్రగతి కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రగతి సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో పాటు వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది ప్రగతి. ముఖ్యంగా యూత్ లో ప్రగతి ఓ రేంజ్ ఫాన్స్ ఉన్నారు అంటే నిజమానే చెప్పాలి. కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నారు నటి ప్రగతి.

    actress pragathi dancing for nagini song and video goes viral

    Also Read: ఛ.. వీడేం హీరో ? వద్దులే అండి కృష్ణగారు !

    అయితే తాజాగా ప్రగతి నాగిని సాంగ్ కు స్టెప్పులేసింది. జిమ్ లో నాగిని పాటకు ఊర మాస్ స్టెప్పులేస్తూ దుమ్మురేపింది ప్రగతి. మాస్ స్టెప్పులతో తనదైన స్టైల్ లో డాన్స్ ఇరగదీసింది ప్రగతి. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ప్రగతి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకు తమ తమ స్టైల్లో కామెంట్లు చేస్తూ ప్రగతిని పొగిడేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల షూటింగ్ సెట్స్ లో ప్రగతి, హీరో నవీన్ చంద్ర, పలువురు నటీనటులతో కలిసి మాస్ స్టెప్పులు వేసింది. బ్యాండ్ కొడుతుంటే ఉత్సాహంతో చీరకట్టులో ప్రగతి డాన్స్ వేసిన వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

    Also Read: హిట్ రాగానే బాలయ్యకు తన బ్రీడ్ గుర్తుకొచ్చిందా ?