Vande Bharat Train
Vande Bharat Train : భారతదేశంలో రవాణా వ్యవస్థలో రైల్వే వ్యవస్థ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భారత రైల్వే ప్రతి రోజూ లక్షలాది మంది ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తూ దేశాన్ని ఏకతాటిపై నిలబెడుతుంది. ఇటీవలి సంవత్సరాల్లో భారత రైల్వే తన సేవలను సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లింది. ఈ పరివర్తనలో ముఖ్యమైన భాగం వందే భారత ఎక్స్‌ప్రెస్. ఇది ఒక సెమీ-హైస్పీడ్ రైలు, ప్రయాణికులకు ఆధ్యునిక సౌకర్యాలతో అందుబాటులో ఉంటూ సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది.
రైళ్ల చివరి బోగీపై ‘X’ గుర్తు ప్రాముఖ్యత
మనకు రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న ప్రతి రైలు చివరి బోగీపై ‘X’ గుర్తును గమనించిన అనుభవం ఉంటుంది. ఈ గుర్తు రైల్వేలో భద్రతకు సంబంధించి ఒక కీలకాంశం. రైల్వే ట్రాక్‌పై రైలు వెళ్తున్నప్పుడు ఈ ‘X’ గుర్తు ఆ రైలు పూర్తిగా వెళ్ళిపోయిందని ధృవీకరిస్తుంది. ఈ గుర్తు కనిపించకపోతే అది రైల్వే అధికారులకు అలర్ట్ సిగ్నల్‌గా పనిచేస్తుంది. అంటే, రైలుకు చెందిన కొన్ని బోగీలు ట్రాక్‌లోనే విడిపోయినట్టు అర్థమవుతుంది. ఈ పరిస్థితి రైల్వే అధికారులను అత్యవసర చర్యలు తీసుకునేలా చేస్తుంది. భద్రత పరంగా ఇది చాలా ముఖ్యమైనది. ఈ గుర్తు పసుపు లేదా తెలుపు రంగులో వుంటుంది. దూరం నుండి కూడా స్పష్టంగా కనిపించేందుకు ఈ రంగులను వాడుతారు.
వందే భారత ఎక్స్‌ప్రెస్‌లో ‘X’ గుర్తు ఎందుకు ఉండదు?
ఈ గుర్తును ఇప్పటి వరకు మనం సాధారణ రైళ్లలో మాత్రమే చూస్తాం. కానీ వందే భారత ఎక్స్‌ప్రెస్‌పై ఈ గుర్తు ఉండదు. ఎందుకంటే, వందే భారత రైలు ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. వందే భారత ఎక్స్‌ప్రెస్ రైలు పూర్తిగా అనుసంధానించిన డిజైన్‌తో తయారు చేయబడింది. ఇది సాధారణ రైళ్ల మాదిరి విడి బోగీలుగా ఉండదు. ఈ రైలు భోగీలు అనుసంధానించడంతో విడిపోయే అవకాశం ఉండదు. వందే భారత రైలును ఏదైనా ఒక వైపు మాత్రమే కాకుండా, రెండు వైపులా నడపడం సాధ్యమవుతుంది. దీని డిజైన్ ఇంజిన్‌కు అనుసంధానంగా కాకుండా ప్రతి చివరా నియంత్రణ ఉండే విధంగా రూపొందించబడింది.
ఆధునిక భద్రతా సిస్టమ్
వందే భారత ఎక్స్‌ప్రెస్ రైలు అత్యాధునిక భద్రతా పరికరాలతో తయారుచేయబడింది. అందువల్ల, సాధారణ రైళ్ల మాదిరిగా ‘X’ గుర్తు అవసరం లేదు.
సాంకేతికతకు నిదర్శనం వందే భారత్
భారతదేశ రైల్వే సేవల్లో వందే భారత ఎక్స్‌ప్రెస్ ఒక నూతన అధ్యాయం. ఈ రైలు వేగం, సౌలభ్యం, భద్రతా ప్రమాణాలలో నూతన ఒరవడిని సృష్టించింది. ‘X’ గుర్తు లేని ఈ రైలు భారత రైల్వే ప్రగతికి ప్రతీక. వందే భారత ఎక్స్‌ప్రెస్ భారతదేశ రైల్వేలో ఒక చారిత్రక అడుగు. ఇది దేశ ప్రజలకు తక్కువ సమయంలో అధునాతన సేవలను అందించడంలో సాంకేతిక అద్భుతంగా నిలిచింది.