Vande Bharat sleeper train: కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆర్థిక పరిస్ధితిని చక్కదిదేందుకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా స్వదేశీ తయారీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా భారత రైల్వే వందేభారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. తాజాగా వందే భారత్ స్లీపర్ రైలును పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. విమానయాన తరహా అత్యాధునిక సౌకర్యాలతో వస్తోంది. 5–స్టార్ హోటల్స్‌ను కూడా దిగదొడ్డే లగ్జరీ ఫీచర్లు ఈ సెమీ–హై–స్పీడ్ ట్రైన్‌ను విప్లవాత్మకంగా మార్చాయి.
విమాన తరహా సౌకర్యాలు..
వందే భారత్ స్లీపర్‌లో విమానాల్లో ఉన్నట్టు వెల్కమ్ డ్రింక్స్, హాట్ మీల్స్, వై–ఫై, యూఎస్‌బీ చార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతీ సీటుకు 1.5 మీటర్ లెగ్ స్పేస్, రీక్లైనర్ సీట్లు, ప్రైవసీ కర్టెన్స్ ఏర్పాటు. బయటి గాలి కలుపుకునే ఏసీ వెంటిలేషన్ వ్యవస్థలు ఆరోగ్యకర వాతావరణాన్ని నిర్ధారిస్తాయి.
ఫైవ్ స్టార్ హోటల్ లెవెల్ లగ్జరీ..
స్లీపర్ కోచ్‌లలో పూర్తి ఫ్లాట్ బెడ్‌లు, మెమరీ ఫోమ్ మ్యాట్రెస్‌లు, పర్సనల్ రీడింగ్ లైట్లు, మర్ఫీ లాండ్రీ సర్వీస్ ఉంటాయి. బాత్‌రూమ్‌లలో హాట్ షవర్స్, ఆటోమేటిక్ సెన్సార్ టాయిలెట్లు, ప్రీమియం టావల్స్. ఫుడ్ కార్ట్‌లో ఇంటర్నేషనల్ మెనూ, లైవ్ కుకింగ్ స్టేషన్ లభిస్తాయి.
టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్..
ఏఐ ఆధారిత ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్, రియల్–టైమ్ ట్రాకింగ్ యాప్, ఫేస్ రికగ్నిషన్ బోర్డింగ్ వ్యవస్థలు ఉంటాయి’ 200 కిమీ/గం వేగంతో ప్రయాణిస్తూ 12–14 గంటల దూరాలను 8 గంటల్లో పూర్తి చేస్తుంది. కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ కాంట్రోల్ సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది.
మిడిల్ క్లాస్‌కు లగ్జరీ ప్రయాణం
వందే భారత్ స్లీపర్ ఏసీ–3 టైర్ ధరలో ఫైవ్–స్టార్ సౌకర్యాలు అందిస్తుంది. దీనితో రైలు ప్రయాణం విమానాలకు పోటీ పడుతుంది. 2026లోపు 50 ట్రైన్లు లాంచ్ చేస్తారు. దీని విజయం రైల్వే ఆదాయాన్ని 25% పెంచి, ప్యాసింజర్ ఫుట్‌ఫాల్‌ను రికార్డ్ స్థాయికి తీసుకెళ్తుందని అధికారులు భావిస్తున్నారు. విమాన టిక్టింగ్ ధరలో రైలులో లగ్జరీ ప్రయాణం చేసి ఎయిర్‌పోర్ట్ రష్ నుంచి బయటపడతారు. నైట్ జర్నీల్లో పూర్తి విశ్రాంతి, ఫ్యామిలీ ట్రావెల్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. మధ్య తరగతి వర్గాలకు ఈ రైలు ప్రయాణ డ్రీమ్‌ను రియాలిటీ చేస్తుంది.
వందే భారత్ స్లీపర్
ప్రయాణికులకు విమానం తరహాలో ఈ రైలులో సౌకర్యాలుంటాయి
ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్స్ సైతం దిగదుడుపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. pic.twitter.com/UJDEod84pm
— greatandhra (@greatandhranews) December 16, 2025