Sharib Hashmi: అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో సూపర్ హిట్ గా నిల్చిన వెబ్ సిరీస్ లలో ఒకటి ‘ది ఫ్యామిలీ మ్యాన్'(The Family Man). ఇప్పటిమువరకు మూడు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ లో నటించిన ప్రతీ ఒకరికి మంచి పేరొచ్చింది. ఈ వెబ్ సిరీస్ దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు ని సమంత రీసెంట్ గా పెళ్లాడింది. అంతే కాదు, రెండవ సీజన్ లో ఆమె పోషించిన మెయిన్ విలన్ క్యారక్టర్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ సిరీస్ లో కథానాయకుడు మనోజ్ బాజ్ పాయ్(Manoj Bajpai) టీం లో ఒకరిగా నటించిన షరీబ్ హష్మీ(Sharib Hashmi) గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ సిరీస్ లో ఆయన జేకే తల్పాడే పాత్రలో అద్భుతంగా నటించాడు. సీరియస్ గా సాగిపోయే ఈ కథలో ఈయన కామెడీ ప్రేక్షకులకు మామూలు రేంజ్ వినోదం పంచలేదు.
సిరీస్ లో అంతటి కామెడీ ని పండించిన ఆయన నిజ జీవితం లో ఎదురుకున్న కష్టాలను చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు. ముఖ్యంగా ఆయన సతీమణి నస్రీన్ హష్మీ కి జీవితాంతం ఓరల్ క్యాన్సర్ తో పోరాటం చేయడానికే సరిపోయింది. ఇప్పటి వరకు ఆమెకు నాలుగు సర్జరీలు జరిగాయి. ఆమెని క్యాన్సర్ నుండి బయటపడేంత వరకు షరీబ్ చేసిన పోరాటం సాధారణమైనది కాదు. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో చూపించాడు. షరీబ్ స్థానం లో వేరే వాళ్ళు ఉండుంటే విడాకులు తీసుకొని రెండవ పెళ్లి చేసుకునేవారు. కానీ తనని నమ్ముకొని వచ్చినా నస్రీన్ ప్రాణాలను కాపాడడం కోసం ఇతను చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు. చివరికి మృత్యువు వడి నుండి నస్రీన్ ని కాపాడుకొని శభాష్ అని అనిపించుకున్నాడు షరీబ్. వీళ్లిద్దరి వివాహం 2003 వ సంవత్సరం లో జరిగింది. అప్పటికీ వీళ్లిద్దరి వయస్సులు కేవలం 18 , 19 సంవత్సరాలు మాత్రమే.
సరికొత్త దాంపత్య జీవితం పై ఎన్నో ఆశలతో ముంబై లో కాపురం మొదలు పెట్టారు. నటన పై మొదటి నుండి ప్రత్యేకమైన ఆసక్తి తో ఉన్న షరీబ్ ఒక పక్క ఉద్యోగం చేస్తూనే, మరోపక్క టెలివిజన్ ఛానెల్ లో పనిచేసేవాడు. ఇలా రెండు పడవల ప్రయాణం ప్రమాదమని తెలుసుకున్న షరీబ్, కొన్నాళ్ళకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి నటనపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాడు. ఆ సమయంలోనే వీళ్లిద్దరికీ కొడుకు పుట్టాడు. షరీబ్ సంపాదన పై ద్రుష్టి పెట్టగా, నస్రీన్ కుటుంబ పోషణపై ద్రుష్టి పెట్టింది. కొన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు ఆమె తనతో పాటు తెచ్చుకున్న నగలను, డబ్బులను, ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టి షరీబ్ ఎదుగుదలకు ప్రోత్సాహం అందించింది. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు ఎక్కడుంటారు చెప్పండి. అలా ఒకరికోసం ఒకరు కష్టసుఖాల్లో తోడుంటూ ఈ జంట ఎన్నో లక్షల మంది జంటలకు ఆదర్శంగా నిల్చింది.