Bangladesh covert armed groups: దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గుర్తింపు లేని సాయుధ వ్యక్తులు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు తరలి, భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్పడినవారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ దాడులు రాజకీయ కుట్రలు, ఆర్థిక ఒత్తిళ్లు, ప్రాంతీయ శత్రుత్వాల మధ్య ముడిపడి ఉన్నట్టు సూచనలు వస్తున్నాయి. ఇటీవలి సంఘటనలు భారత్, బంగ్లాదేశ్ మధ్య డిప్లొమటిక్ టెన్షన్‌ను పెంచాయి.
భారత వ్యతిరేకులే టార్గెట్..
ఈ సాయుధ సమూహాలు మొదట పాకిస్తాన్‌లో లష్కర్–ఎ–తొయిబా, జైష్–ఏ–మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలను, ఐఎస్‌ఐ ఏజెంట్లను టార్గెట్ చేసేవి. ఇప్పుడు ఢాకా, చిట్టగాంగ్ ప్రాంతాల్లో కనిపించి, భారత శత్రుత్వం చూపే వ్యక్తులపై దాడులు చేస్తున్నారు. చైనా వ్యతిరేకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. చిట్టగాంగ్‌లోని ఒక హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో అమెరికా నుంచి వచ్చిన వారు అనుమానాస్పదంగా మరణించారు. వీరిలో పాకిస్తాన్ ఇంటలిజెన్స్‌కు సంబంధం ఉన్నట్టు అనుమానాలు. పాకిస్తాన్ భారత రా ఏజెంట్లు దీని వెనుక ఉన్నారని ఆరోపిస్తోంది. అయితే, పాకిస్తాన్ ఆర్థిక కర్చులు తగ్గించుకోవడానికి ఈ సమూహాలను ఉపయోగిస్తోందని విమర్శకులు వాదిస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత రాయబారిని పిలిచి ఈ ఆరోపణలపై చర్చించింది.
ఉస్మాన్ హాదీపై దాడి..
ఇంక్విలాబ్ మంచ్ (విప్లవ వేదిక) నాయకుడు ఉస్మాన్ హాదీ భారత వ్యతిరేక ప్రచారంలో ముందుండేవాడు. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వదిలిపోవాలని డిమాండ్ చేసిన ఉద్యమాల్లో పాల్గొన్నాడు. డిసెంబర్ 13న ’బృహత్తర బంగ్లాదేశ్’ పేరుతో మ్యాప్ పోస్టర్ విడుదల చేశాడు. ఇందులో బంగ్లాదేశ్‌తో పాటు బర్మా ప్రాంతాలు, అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ జిల్లాలు చేర్చారు. పూర్తి జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌ను పాకిస్తాన్‌లో చూపించడంతో పెద్ద వివాదం రేగింది. కొందరు మద్దతు తెలిపగా, ఇతరులు తీవ్రంగా వ్యతిరేకించారు. డిసెంబర్ 14న మసీదు ప్రార్థనలు ముగించి రిక్షాలో వెళ్తుండగా, హెల్మెట్ ధారించిన ఇద్దరు బైకర్లు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. హాదీ అక్కడే కూలాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. భారత ఏజెంట్ల చేతిలో పడ్డాడని అనుమానాలు లేవనెత్తాయి.
రాజకీయ కుట్రలు..
ఈ దాడి బంగ్లాదేశ్ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించినదని కొందరు భావిస్తున్నారు. అవామీ లీగ్ మరో పేరుతో పోటీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. హాదీ వంటి యువ నాయకులను అరటి చేయడం ద్వారా రాజకీయ భవిష్యత్తును రూపొందించాలని కుట్రలు జరుగుతున్నాయా? భారత వ్యతిరేకతను పెంచి, దేశీయ మద్దతును సేకరించాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ప్రభుత్వ చర్యలు..
బంగ్లాదేశ్ ప్రభుత్వం దాడి చేసినవారిని పట్టిస్తే 50 లక్షల టాకా బహుమతి ప్రకటించింది. ఈ సంఘటనలు పాకిస్తాన్, చైనా లింకులతో ముడిపడి ఉంటే, దక్షిణాసియా భద్రతపై ప్రభావం చూపుతాయి. భారత్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ, తన రహస్య సేవల స్పష్టత ఇచ్చింది. ఈ టెన్షన్‌లు డిప్లొమటిక్ సంబంధాలను ప్రభావితం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.