https://oktelugu.com/

Vanama Raghava Arrested: ఎట్టకేలకు పోలీసుల అదుపులోకి వనమా రాఘవ.. రాజమండ్రికి పారిపోతుండగా అరెస్ట్..

Vanama Raghava Arrested: పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో రాఘవ పోలీసులకు దొరికిపోయాడు. రాఘవేంద్రరావు ఏపీలోని రాజమండ్రికి పారిపోయేందుకుగాను సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే దమ్మపేట, చింతలపూడి మధ్య రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. పాల్వంచ నాగ రామకృష్ణ కుటుంబం సూసైడ్ కేసులో వనమా రాఘవ ఏ2గా ఉన్నాడు. రాఘవను ఆల్రెడీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 8, 2022 / 11:16 AM IST
    Follow us on

    Vanama Raghava Arrested: పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో రాఘవ పోలీసులకు దొరికిపోయాడు. రాఘవేంద్రరావు ఏపీలోని రాజమండ్రికి పారిపోయేందుకుగాను సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే దమ్మపేట, చింతలపూడి మధ్య రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. పాల్వంచ నాగ రామకృష్ణ కుటుంబం సూసైడ్ కేసులో వనమా రాఘవ ఏ2గా ఉన్నాడు.

    Vanama Raghava Arrested

    రాఘవను ఆల్రెడీ పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, వనమా రాఘవ తమకు దొరకలేదని కొత్తగూడెం పోలీసులు ఆ తర్వాత ప్రకటించారు. కాగా, ఎట్టకేలకు వనమా రాఘవేంద్రరావును అరెస్టు చేసినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. రాఘవేంద్రరావుపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన పోలీసులు.. రాఘవ అరెస్టు అయిన నేపథ్యంలో అతనిని విచారణ నిమిత్తం కోర్టులో హాజరు పరచనున్నారు. నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో వనమా రాఘవేంద్రరావును హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది. కానీ, అది నిజం కాదు. కొత్తగూడెం పోలీసులు దమ్మపేటలో రాఘవను అరెస్టు చేశారు.

    Also Read: ఎట్టేకేలకు వనమా రాఘవను సాగనంపిన టీఆర్ఎస్

    ఇకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్‌చార్జి నూకల నరేష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వనమా రాఘవను సస్పెండ్ చేసినట్లు పల్లా, నూకల పేర్కొన్నారు. సస్పెన్షన్ వెంటనే అమలులోకి వస్తుందని అన్నారు.

    పాల్వంచలోని పాత బజారుకు చెందిన రామకృష్ణ కుటుంబం ఈ నెల 3న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, నాగ రామకృష్ణ సూసైడ్ కు ముందర రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నాగ రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకున్నారు. తన సమస్యలు పరిష్కరించాలంటే తన భార్యను పంపించాలని వనమా రాఘవ అన్నాడని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో సంచలన ఆరోపణలు చేశారు. రాఘవ వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయని ఆరోపించారు.

    Also Read: ఈటలకు అలా.. ‘వనమా’కు ఇలా..కేసీఆర్ ది ధృతరాష్ట్ర తీరేనా?

    Tags