AP Movie Tickets: ఆంద్రప్రదేశ్ లో సినిమా టికెట్ల గురించి జరుగుతున్న రచ్చ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.అసలు సినిమా టికెట్ల గురించి ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటి అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు థియేటర్ ఉన్న పరిధిని బట్టి సినిమా టికెట్ల ధరలకు కనీస, గరిష్ట పరిమితులుగా విధించింది జగన్ ప్రభుత్వం. కార్పొరేషన్ పరిధిలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో కనీస ధర 75, గరిష్టం 250 పెట్టింది. అదే నాన్-ఏసీ, ఏసీ సింగిల్ తెర థియేటర్లలో అయితే కనీస ధర 20, గరిష్టం 100 రూపాయలుగా నిర్ణయించింది.

ఇక గ్రామ పంచాయితీ పరిధిలో కనీస ధర 5, గరిష్టం 20 రూపాయలు అని నిర్ణయించింది. థియేటర్లన్నీ ఏసీ, నాన్-ఏసీ విధివిధానాలను బట్టి భద్రతా ప్రమాణాలు పాటించాలి అని కూడా చెప్పింది. ముఖ్యంగా తాగడానికి సురక్షిత నీరు, పరిశుభ్రమైన టాయిలెట్లు తప్పనిసరిగా ఉంచాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా బాగుంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రజలు టికెట్లు కొనటానికి ప్రభుత్వ వెబ్‌సైట్/యాప్ లను మాత్రమే వాడాలి అన్నది ఏ కోణంలో ఆలోచించినా అవగాహనకు అందట్లేదు.
Also Read: జగన్ దెబ్బ మామూలుగా లేదుగా?
అసలు ఇదంతా జగన్ ఎందుకు చేస్తున్నారు ? ప్రభుత్వ పనితనాన్ని పవన్ ప్రశ్నించాడు, అంతే, పవన్ సినిమా విడుదలకు ముందే గబుక్కున జగన్ కి ఈ ఐడియాలు తట్టాయి. దీని వెనుక ఉద్దేశ్యం ప్రజా ప్రయోజనమా ? జగన్ ప్రయోజనమా ? అని ప్రజలే ఆలోచించుకోవాలి. అన్నిటికీ మించి ప్రభుత్వ విధి విధానాలు ఏకపక్షంగా ఉండకూడదు. అయితే, ప్రజలు తక్కువ ధరలకే సినిమాలు చూడాలి అన్నది మంచి ఉద్దేశ్యమే. కాకపోతే అది మంచి పద్దతిలోనే జరగాలి.
ఈ మధ్య దేశమంతా విడుదల అవుతున్న తెలుగు సినిమాలకు ఇంట్లోనే తగినంత గిట్టుబాటు లేకపోతే అది ఆ ఇంటికే అవమానం ? జగన్ నష్టం ఉండకపోవచ్చు, కానీ తెలుగు ఇండస్ట్రీకి నష్టం. నష్టం వస్తే.. ఇక పరిశ్రమ పూర్తిగా ఆంధ్రను వదిలెళ్ళిపోతుంది. అయినా ప్రైవేటు వ్యక్తులు / సంస్థలు నిర్మించిన సినిమాల అమ్మకాలను గుప్పెట్లో పెట్టుకోవాలనుకోవడం కచ్చితంగా తప్పే.
Also Read: ఏం మాయ చేశావ్ జగన్.. జీతం కట్ చేసి మరీ ఎలా ఒప్పించావ్.?