Vallabhaneni Vamsi: ‘గడగడపకు వైసీపీ మా ఇంటి పండుగ..మా కుటుంబ పండుగ. మమ్మల్ని మాత్రమే నిర్వహించుకోనివ్వండి. బయటి వారి జోక్యం అవసరం లేదు’.. ఇది వల్లభనేని వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్న గన్నవరంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు. ఇవి పెద్ద కలకలమే రేపుతోంది. నియోజకవర్గంలో వంశీ వ్యతిరేకులంతా దాదాపు ఒక్కటయ్యారు. ఇప్పటివరకూ నియోజకవర్గ నేతలుగా ఉన్న వెంకటరావు, రామచంద్రరరావు వర్గీయులు ఏకతాటిపైకి వచ్చి వల్లభనేని వంశీపై యుద్ధం ప్రకటించారు. అయితే ఇటీవల పరిణామాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో వంశీ సైలెంట్ అయిపోయారన్న టాక్ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ..ఆ కొద్ది కాలానికే వైసీపీ నేతలకు దగ్గరయ్యారు. చంద్రబాబు – లోకేష్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు.

తన స్నేహితుడు నాటి మంత్రి కొడాలి నాని తో కలిసి వైసీపీకి మద్దతుగా తన వాయిస్ వినిపించారు. వైసీపీలో తన బెర్త్ ను ఖాయం చేసుకునేందుకు తెగ దూకుడు ప్రదర్శించారు. కానీ పరిస్థితి చూస్తే అంతా అనుకూలంగా లేదు. తన విషయం పార్టీ కీలక నేతలతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దాలని ప్రయత్నించినా…వ్యవహారం అలాగే కొనసాగుతోంది. కొద్ది కాలం క్రితం వంశీకి వ్యతిరేకంగా గన్నవరం వైసీపీ కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డిని కలిసి..వంశీకి ఇన్ ఛార్జ్ పదవి ఇస్తే గన్నవరంలో పార్టీ గెలవదని..మరెవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేసారు. లేఖ కూడా అందించారు. ఈ పరిస్థితుల్లో గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో విభేదాలు మరింత భగ్గుమన్నాయి. బుధవారం నుంచి ప్రారంభమైన గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని ఎవరికి వారే నిర్వహించుకున్నారు.
Also Read: AP Volunteers: వలంటీర్లకు పంగనామం.. సత్కారాలతో సరిపెట్టేశారు
వ్యతిరేకులు అధికం..
ఆది నుంచి వల్లభనేని వంశీ రాకను నియోజకవర్గంలోని వైసీపీ నేతలు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇందుకు చాలా కారణాలున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ దూకుడుగా వ్యవహరించారు. వైసీపీ శ్రేణులపై కేసులు పెట్టించారు. ఆర్థిక మూలాలపై సైతం దెబ్బతీశారు. అందుకే వంశీ రాకను వైసీపీ కీలక నాయకుల నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ది గా వంశీ పోటీ చేస్తారనే ప్రచారంతో పార్టీ లోని వ్యతిరేక శ్రేణులు ఒక్కటయ్యారు. ఎవరికి సీటు వచ్చినా..వంశీకి మాత్రం సీటు దక్కకుండా చూడాలనే వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. దీంతో..ఇప్పుడు పార్టీ అధినాయకత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, వంశీకి మద్దతుగా ఆయనతో పాటుగా టీడీపీ నుంచి వచ్చిన వారు మినహా.. వైసీపీ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో సహకారం అందటం లేదు. అదే విధంగా అటు చీరాల లోనూ టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన కరణం బలరాం వర్సస్ ఆమంచి అన్నట్లుగా అక్కడ మద్దతు దారుల వ్యవహారం మారింది.

గన్నవరంపై టీడీపీ ఫోకస్
అయితే, 2024 ఎన్నికల పైనే ఇప్పటికే ఫోకస్ పెట్టిన సీఎం జగన్..ప్రతీ సీటును కీలకంగా భావిస్తున్నారు. అయితే, గతంలో పలు మార్లు సీఎంను కలిసిన వంశీ..ఈ మధ్య కాలంలో సీఎంతోనూ భేటీ అయిన సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. దీంతో..వంశీ ఆలోచనలు ఏంటి… గన్నవరం విషయంలో వైసీపీ ముఖ్య నాయకత్వం ఏం చేయబోతోంది…గన్నవరం పంచాయితీకి ఎలాంటి ముగింపు ఇస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. మరోవైపు గన్నవరం స్థానంపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వైసీపీలో విభేదాలను చూసి సరైన క్యాండేట్ ను బరిలో దించాలని ఆలోచిస్తున్నారు. అందుకే ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు తో పాటు కుమారుడు లోకేష్ సైతం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వంశీని తెగ్గొట్టాలని భావిస్తున్నారు. కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే వైసీపీలో గౌరవం లేదు.. టీడీపీ చూస్తే పగతో ఉండడంతో రాజకీయంగా సైలెంట్ కావడమే మంచిదన్న భావనలో వంశీ ఉన్నారు.
Also Read:Analysis on Narayana Arrest : నారాయణ అరెస్ట్ పై ఎన్నో అనుమానాలు?
[…] Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ సైలెంట్.. కారణం… […]