https://oktelugu.com/

ఆంధ్రాలో ఆధార్ లేని వాళ్లే తెలుగుదేశంలో ఉంటారంటున్న టీడీపీ ఎమ్మెల్యే..?

ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అస్సలు బాగోలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీకి షాకులిస్తున్నారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పనైపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిందని.. ఏపీలో కూడా అదే దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. Also Read : తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు.. చంద్రబాబుకు షాక్ తెలుగుదేశం పార్టీకి సీనియర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 21, 2020 / 04:46 PM IST
    Follow us on

    ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అస్సలు బాగోలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీకి షాకులిస్తున్నారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పనైపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిందని.. ఏపీలో కూడా అదే దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు.

    Also Read : తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు.. చంద్రబాబుకు షాక్

    తెలుగుదేశం పార్టీకి సీనియర్ ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు అని అంతటి మహనీయుడు స్థాపించిన పార్టీని చంద్రబాబు భూస్థాపితం చేస్తూ భూస్థాపిత అధ్యక్షుడిగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నాడని అన్నారు. ఏపీలో 2019 ఎన్నికల ఫలితాల్లో 175 సీట్లలో కేవలం 23 సీట్లలో మాత్రమే విజయం సాధించి టీడీపీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకుందని పేర్కొన్నారు. లోకేష్ వల్లే ఏపీలో టీడీపి దారుణమైన ఫలితాలను అందుకుందని చెప్పారు.

    తెలుగుదేశం పార్టీ మూతబడే పార్టీ అని… మూతబడే పార్టీలో ఎవరూ ఉండరని పేర్కొన్నారు. లోకేశ్ బరువుకు టీడీపీ మునిగిపోతుందంటూ వంశీ ఎద్దేవా పెట్టారు. చంద్రబాబు పోలవరాన్ని చూపించడానికి మాత్రమే 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని అన్నారు. పార్టీ ఎన్నికల గుర్తు కోసం చంద్రబాబు ఏమేం చేశాడో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు.

    సీఎం జగన్ అంగీకరిస్తే టీడీపీ నుంచి చాలామంది నేతలు వైసీపీలోకి వెళతారని… ఆంధ్రాలో ఆధార్ కార్డ్ లేనివాళ్లు మాత్రమే టీడీపీలో ఉంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి మద్దతు ఇచ్చిన టీడీపీ నేతలు దేశద్రోహులైతే ఆ దేశద్రోహుల అధ్యక్షుడు చంద్రబాబు అని గుర్తుంచుకోవాలని చెప్పారు. వైసీపీకి తాము సంఘీభావం ప్రకటిస్తున్నామే తప్ప జగన్ తమను పార్టీలో చేర్చుకోలేదని అన్నారు.

    Also Read : టీటీడీపీ మార్పు ఖాయమా.. బాబు ఆలోచన ఏంటీ?