https://oktelugu.com/

కాలుష్య కారకం.. ఉత్తర భారతంలో ఆరని ‘మంటలు’

ఇప్పటికే దేశాన్ని కరోనా మహమ్మారి కుంగదీస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది వైరస్‌ బారిన పడ్డారు. వేలాది మంది మృతిచెందారు. దేశంలోకి వైరస్‌ వచ్చి నెలలు గడస్తున్నా దాని వ్యాప్తి పెరుగుతోందే తప్ప.. తగ్గిందైతే లేదు. ఇప్పటికే ఈ మహమ్మారితో పోరాడుతున్న ఉత్తర భారత వాసులకు మరో ముప్పు పొంచి ఉందంట. హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంట మొదళ్లను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యంతో కరోనా వైరస్‌ పడిన వారికి ఇది మరింత ఇబ్బందిని తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని […]

Written By:
  • NARESH
  • , Updated On : September 21, 2020 8:32 pm
    Follow us on


    ఇప్పటికే దేశాన్ని కరోనా మహమ్మారి కుంగదీస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది వైరస్‌ బారిన పడ్డారు. వేలాది మంది మృతిచెందారు. దేశంలోకి వైరస్‌ వచ్చి నెలలు గడస్తున్నా దాని వ్యాప్తి పెరుగుతోందే తప్ప.. తగ్గిందైతే లేదు. ఇప్పటికే ఈ మహమ్మారితో పోరాడుతున్న ఉత్తర భారత వాసులకు మరో ముప్పు పొంచి ఉందంట.

    హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంట మొదళ్లను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యంతో కరోనా వైరస్‌ పడిన వారికి ఇది మరింత ఇబ్బందిని తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని వాతావరణ, వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుంటుంది. కొత్తగా ఈ కాలుష్యం మరింత ఇబ్బందిగా ఏర్పడే పరిస్థితి ఉందని అంటున్నారు.

    Also Read : అన్నదాతలకు తీపికబురు చెప్పిన మోడీ సర్కార్

    ఏటా చలికాలం ప్రారంభంలో హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంట మొదళ్లు తగలబెడుతుంటారు. వీటివల్ల ఏర్పడే కాలుష్యంతో దేశరాజధాని ఢిల్లీతోపాటు ఉత్తర భారత్‌ అంతా కూడా కాలుష్యంతో నిండిపోతుంది. ముఖ్యంగా కార్బన్‌ మోనాక్సైడ్‌, మీథేన్‌ వంటి విషవాయువుల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. అంతేకాదు.. వాతావరణ కాలుష్య స్థాయి 18 నుంచి 40 శాతానికి పెరగడం ఈ దహనమే కారణమని నివేదికలు చెబుతున్నాయి. అయితే.. వీటిని అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది. కేవలం పంజాబ్‌ రాష్ట్రంలోనే గతేడాది దాదాపు 50 వేల కేసులు నమోదు చేశారు. అయినా.. రైతుల్లో మార్పు మాత్రం రావడం లేదు.

    తాజాగా ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతోపాటు పంజాబ్‌కు వ్యవసాయ నిర్వహణ సలహాదారుగా ఉన్న సంజీవ్‌ నాగ్‌పాల్‌ స్పష్టం చేస్తున్నారు. కరోనా వేళ.. పంట మొదళ్లను కాల్చడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. శ్వాసకోస సమస్యలకు ఈ చర్యలు మరింత ఆజ్యం పోసినట్లేనని అభిప్రాయపడ్డారు.