https://oktelugu.com/

రిఫరెండమా? చంద్రబాబు గాలితీసిన వంశీ

అమరావతి రాజధానిపై రిఫరెండంకు సిద్ధమని టీడీపీ చంద్రబాబు చేసిన ప్రకటన ఏపీలో రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఆయన పార్టీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గాలితీసేలా వ్యాఖ్యానించారు. Also Read: చంద్రబాబు, జగన్.. ఓ అధికారి బలి! వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. ‘అమరావతి రాజధాని ఏర్పాటు సమయంలో చంద్రబాబు ఎందుకు రిఫరెండం నిర్వహించలేదని’ ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించారు. పనికిరాని వ్యక్తుల మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన […]

Written By:
  • NARESH
  • , Updated On : December 19, 2020 / 07:09 PM IST
    Follow us on

    అమరావతి రాజధానిపై రిఫరెండంకు సిద్ధమని టీడీపీ చంద్రబాబు చేసిన ప్రకటన ఏపీలో రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఆయన పార్టీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గాలితీసేలా వ్యాఖ్యానించారు.

    Also Read: చంద్రబాబు, జగన్.. ఓ అధికారి బలి!

    వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. ‘అమరావతి రాజధాని ఏర్పాటు సమయంలో చంద్రబాబు ఎందుకు రిఫరెండం నిర్వహించలేదని’ ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించారు. పనికిరాని వ్యక్తుల మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదని అన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడని చెప్పుకునే చంద్రబాబు రిఫరెండం అనే మాట ఏ విధంగా మాట్లాడుతారని ధ్వజమెత్తారు. భారతదేశంలో ఏ విషయంలోనూ రిఫరెండం అనేదే లేదన్నారు.

    చంద్రబాబు హైకోర్టులో గాగ్ ఆర్డర్ ఎందుకు తీసుకున్నారు? కొండను తవ్వి ఎలుకను పట్టారా? పందికొక్కులను పట్టారో త్వరలోనే తెలుస్తుందని వంశీ వ్యాఖ్యానించారు.

    Also Read: గన్నవరం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

    ఇప్పటికైనా చంద్రబాబు వయసు తగ్గ మాటాలు మాట్లాడాలని వంశీ నిప్పులు చెరిగారు. చంద్రబాబునాయుడు రిఫరెండం అనడం చూస్తుంటే ఆయన వయసు మందగించిందని మరోసారి బయటపడిందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ విమర్శించారు. కృష్ణ జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లకు ఆయన శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం వంశీ ఈ మాటలు మాట్లాడారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్