ఐకా ఫిల్మ్ ఫాక్టరీ బ్యానర్ పై అసిఫ్ ఖాన్ మరియు మౌర్యాని హీరో హీరోయిన్స్ లుగా నటిస్తున్న సినిమా “నేడే విడుదల”. ఈ సినిమా ద్వారా రామ్ రెడ్డి పన్నాల డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ తమ సినిమా ఫస్ట్ లుక్ ని ఫస్ట్ సాంగ్ ని ప్రేక్షకుల చేతుల మీదుగా విడుదల చేయించాలని భావించి, ఒక విన్నూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది, వాళ్ళు పెట్టిన కాంటెస్ట్ కి, వాట్సాప్ నంబర్ కి వేల కొద్దీ మెసేజ్ లు వచ్చాయి. దానిలో నుండి లక్కీ డ్రా ద్వారా ఇద్దరిని సెలక్ట్ చేసి ఒకరితో ఫస్ట్ లుక్, మరొకరితో ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా జరిగిన ఫిల్మ్ ప్రెస్ మీట్ లో సినిమా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఎట్టకేలకు మేము అనుకున్నది సాధించాము, మా సినిమా ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ ని ప్రేక్షకుల చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేసారు.
Also Read: రాజుగారి బూతు సినిమా ‘డర్టీ హరి’ ఎలా ఉందంటే ?
వివరాల్లోకి వెళితే, కాంటెస్ట్ ద్వారా విన్ అయిన వెన్నెలతో ఫస్ట్ లుక్ ని, మరియు మరొ విన్నర్ వంశీ కృష్ణ ద్వారా లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయించిన చిత్ర యూనిట్ కొత్త ప్రచారానికి నాంది పలికారు.
కాశి విశ్వనాథ్ గారు మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీ కి సంబందించిన ఒక పాయింట్ తీసుకోని సినిమాగా మలిచారు. సినిమా చాలా బాగా వచ్చింది. మా ఆర్టిస్ట్ లు అసిఫ్, మౌర్యాని ఈ కథలో పాత్రలకు చక్కగా కుదిరారు. ఈ సినిమా చిన్న సినిమాల్లో మంచి సినిమా అవుతుందని తెలిపారు.
అప్పాజీ అంబరీషా గారు మాట్లాడుతూ ఈ సినిమాలో నేనొక మంచి క్యారక్టర్ ప్లే చేశాను, ఈ సినిమా కథ, మేకింగ్ అద్భుతంగా ఉంటాయి, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి సూపర్ హిట్టు చేయాలనీ కోరుకుంటున్నాను అని తెలిపారు.
కో ప్రొడ్యూసర్ “విన్నకోట అజయ్ భాస్కర్” గారు మాట్లాడుతూ కొత్త టీం, కొత్తగా ప్రయత్నం చేసింది. మీరందరూ సహకరించి చిత్రాన్ని ఘన విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. అని తెలిపారు.
నిర్మాత “మస్తాన్ ఖాన్” గారు మాట్లాడుతూ నాకు సినిమా అంటే చాలా ఇష్టం, ఆ ఇష్టం తోనే ఈ సినిమా తీసా, అదృష్టం ఏంటి అంటే మా మొదటి సినిమా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కావడం ఆనందదాయకం. సినిమా చాలా బాగా వచ్చింది, దీనికి కారణం డైరెక్టర్, తను హ్యాండిల్ చేసిన విధానం, మంచి టాలెంటెడ్ హీరో దొరికారు. అజయ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. చిన్న సినిమా అయినా కానీ శ్రీమణి మంచి లిరిక్స్ ఇచ్చారు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరూ అందించిన అద్భుత సహకారం వల్ల ఈ సినిమాను ఇంత గొప్పగా తెరకెక్కించగలిగాం. మా సినిమా హీరో మీడియాలోని ఒక జర్నలిస్ట్ పాత్ర పోషించారు, కాబట్టి మీడియా సహకారం మాకు ఉంటుందని ఆశిస్తున్నాము.
Also Read: ముగిసిన బిగ్ బాస్ ఓటింగ్.. ఎవరికి ఎన్ని ఓట్లు అంటే ?
“సురేష్ కొండేటి” గారు మాట్లాడుతూ నేను ఈ సినిమా సాంగ్స్ అన్ని విన్నా, ట్రైలర్ చూసా, నాకు బాగా నచ్చింది. 2021 చిన్న సినిమాలలో ఈ నేడే విడుదల మంచి సినిమా, సూపర్ హిట్టు సినిమా అవుతుంది. ఈ సినిమాకు ఇండస్ట్రీ నుండి ప్రేక్షకుల వరకూ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
దర్శకుడు “రామ్ రెడ్డి పన్నాల” మాట్లాడుతూ ప్రేక్షకుల ద్వారా సాంగ్ రిలీజ్ అని పెట్టిన కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది, అది మీడియా వల్లనే జనాలకు బాగా రీచ్ అయింది, దానికి ముఖ్య కారణం మా పి ఆర్ ఓ సురేష్ కొండేటి గారు. శ్రీమణి మంచి సాహిత్యం ఇచ్చారు. కెమెరా మ్యాన్ మోహన్ చారి మంచి విజువల్స్ ఇచ్చారు, అది మా సినిమాకు ఎసెట్. ఎడిటర్ సాయి బాబు తలారి గారు ఎడిటింగ్ వర్క్ మా సినిమాకు ప్లస్ కానుంది. ఇందులో పనిచేసిన ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ సహకారం వలన ఈ సినిమాను త్వరగా క్వాలిటీ తో తెరకెక్కించగలిగాను. నెక్స్ట్ సాంగ్స్ కూడా ఇలానే కాంటెస్ట్ ల ద్వారా రిలీజ్ చేస్తాం, ప్రస్తుతం సెన్సార్ దశలో ఉన్న మా సినిమాను అతి త్వరలో రిలీజ్ చేస్తాం అని తెలిపారు.
హీరో “అసిఫ్ ఖాన్” మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా ఇష్టం, నేను యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నా.., సినిమా అంటే వున్న ఇష్టంతో హీరోగా ట్రై చేస్తున్నప్పుడు రామ్ రెడ్డి మంచి కథతో నా ముందుకి వచ్చారు. కథ నచ్చి సినిమా చేశా. మా సినిమాకు మా పి ఆర్ ఓ సురేష్ కొండేటి గారి సహకారం మరవలేనిదని తెలుపుతూ, మరి ముఖ్యంగా నా పేరెంట్స్ ఎప్పటికి ఋణపడి ఉంటాను, మంచి యంగ్ ఫ్యాషనేట్ టీం తో కలసి చేసిన ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది, ప్రేక్షకులు అందరూ మా సినిమాను ఆధరిస్తారని నమ్ముతున్నాము.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్