https://oktelugu.com/

సౌత్ వాళ్లకు అలా కనిపిస్తే నచ్చదు… సమంత సంచలన కామెంట్స్

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేశారు. సౌత్ ప్రేక్షకుల అభిరుచిని ఆమె ఒకింత తక్కువ చేసి మాట్లాడారు. సమంత మాట్లాడుతూ… బాలీవుడ్ లో స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా నెగెటివ్ రోల్స్ చేయడానికి వెనుకాడరు. అలాగే అక్కడ ప్రేక్షకులు హీరోలు ఏ తరహా పాత్రలు చేసినా అంగీకరిస్తారు. కానీ సౌత్ ప్రేక్షకులు అలా కాదు. వాళ్లు ఒక ఇమేజ్ కలిగిన నటుడు లేక నటిని అదే తరహా పాత్రలో చూడడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా […]

Written By:
  • admin
  • , Updated On : December 19, 2020 / 07:16 PM IST
    Follow us on


    స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేశారు. సౌత్ ప్రేక్షకుల అభిరుచిని ఆమె ఒకింత తక్కువ చేసి మాట్లాడారు. సమంత మాట్లాడుతూ… బాలీవుడ్ లో స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా నెగెటివ్ రోల్స్ చేయడానికి వెనుకాడరు. అలాగే అక్కడ ప్రేక్షకులు హీరోలు ఏ తరహా పాత్రలు చేసినా అంగీకరిస్తారు. కానీ సౌత్ ప్రేక్షకులు అలా కాదు. వాళ్లు ఒక ఇమేజ్ కలిగిన నటుడు లేక నటిని అదే తరహా పాత్రలో చూడడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్స్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు చేస్తే అంగీకరించరు అన్నారు. ఇది ఒకింత నిజమై నప్పటికీ దమ్మున్న కథలో బలమైన పాత్ర ఎలాంటిదైనా ప్రేక్షకులు అంగీకరిస్తారు.

    Also Read: రాజుగారి బూతు సినిమా ‘డర్టీ హరి’ ఎలా ఉందంటే ?

    నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూ కొందరు సౌత్ హీరోలు పరిశ్రమలో రాణిస్తున్నారు. ఇటీవల యంగ్ హీరో కార్తికేయ గ్యాంగ్ లీడర్ మూవీలో నానికి విలన్ గా చేసిన సంగతి తెలిసిందే. స్టైలిష్ విలన్ గా కార్తికేయ ప్రసంశలు అందుకున్నారు. అలాగే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విక్రమ్ వేదా మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ మూవీలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. కన్నడ హీరోలు సుదీప్, ఉపేంద్రలు కూడా టాలీవుడ్ హీరోల సినిమాలలో విలన్స్ గా చేసి విజయం సాధించారు.

    Also Read: ముగిసిన బిగ్ బాస్ ఓటింగ్.. ఎవరికి ఎన్ని ఓట్లు అంటే ?

    ఫ్యామిలీ చిత్రాల హీరోగా వందల చిత్రాల్లో నటించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా ఏస్థాయికి వెళ్ళాడో అందరికీ తెలిసిందే. సౌత్ లో కూడా కొందరు స్టార్స్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు, వాళ్ళను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాబట్టి సమంత అభిప్రాయాన్ని ఏకపక్షంగా అంగీకరించలేం. కాకపోతే బాలీవుడ్ తో పోల్చుకుంటే హీరోలు నెగిటివ్ రోల్స్ చేయడమనేది చాలా తక్కువ. మరి విజయ్ సేతుపతి, సుదీప్, ఉపేంద్ర వంటి హీరోలను సమంత మరచిపోయినట్లు ఉన్నారు. కాగా సమంత డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ సిరీస్ లో పాకిస్థానీ అమ్మాయిగా సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారని ప్రచారం జరుగుతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్