గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేల లో ముఖ్యమైన నేతగా మనకు తెలుసు. కరణం బలరాం, మద్దాల గిరిలతో పోలిస్తే వంశీ తరచూ చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. ఇక అతను వైసీపీ కండువా కప్పుకోవడం ఒకటే మిగిలి ఉంది అన్నట్లు ఇన్ని రోజులు ప్రవర్తించారు. ఇక జగన్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తన పార్టీలోకి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా రావాలి అనుకుంటే వారు ఆ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సిందే అని ఒక షరతు పెట్టారు. దీనితో టిడిపి నేతగానే ఉంటూ వంశీ చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ఉన్నారు.
తాను అయితే ఒక్కసారిగా ఇప్పుడు వంశీ మోహన్ గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఇంచార్జినని స్వయంగా ప్రకటన చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. అధికారికంగా వైసీపీలోకి ఇంకా ప్రవేశించని వంశీ ఇలా ప్రకటించడానికి కారణం ఉందట. వైసీపీకి క్యాడర్ సపోర్ట్ ఇవ్వడం లేదు. టిడిపిలో ఉన్నప్పటి నుండి ఆయనతో పాటు ఉన్న వారితోనే కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇక అప్పటి నుండి వైసీపీకి ఉన్న క్యాడర్ అంతా దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వెనుక ఉన్నారు. ఇప్పుడు వీరు ఇరువురు ఎవరి రాజకీయాల వారు చేసుకుంటున్నారు, దుట్టా రామచంద్ర రావు అల్లుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు. ఆయన గన్నవరం సీటు కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. తను వైఎస్ కుటుంబానికి చెందినవాడిని అని చెబుతూ అధికారులతోనూ పనులు చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. దుట్టా కాని, యార్లగడ్డ కానీ వల్లభనేని తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు.
ఇక ఈ క్రమంలో టిడిపిని చంద్రబాబుని విమర్శించాలన్న సంకేతాలు వచ్చిన ప్రతీసారి వంశీ తన విధేయతను చాటుకోవడానికి వెనుకాడడం లేదు. అటు దుట్టా, యార్లగడ్డ వెంకట్రావు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో వంశీ వారి తాకిడిని తట్టుకునేందుకు, ఆ నేతల దూకుడు ని తగ్గించి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు తానే గన్నవరం నియోజకవర్గానికి ఇన్చార్జినని, ఎమ్మెల్యేను అని కూడా స్వయంగా ప్రకటించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. మరి అతను అన్న మాటలకు తగ్గట్టు త్వరలోనే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం అవుతారా లేక కేవలం మాటల వరకే పరిమితం అయి వైసిపి కమ్ టిడిపి నేత కొనసాగుతారో వంశీకే తెలియాలి.
అయితే వల్లభనేని మొత్తానికి ఆయన మాత్రం వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు అని ప్రజల్లో బలమైన భావన వచ్చేయడంతో అందరి కళ్ళు జగన్ వైపు నిలిచాయి. ఇప్పుడు ఒక్కసారిగా అందరూ టిడిపి ఎమ్మెల్యేని వైసిపి పార్టీ ఇంచార్జి అని చెప్పుకోవడం ఏమిటి అని జగన్ ను ఉద్దేశించి ప్రశ్నల వర్షాం కురిపిస్తున్నారు. మరి దీనిపై జగన్ కు సైతం ఏమని స్పందించాలో అర్థం కావడం లేదు. మరి అంత డైలమాలో పడేశాడు వల్లభనేని వంశీ.