Homeజాతీయ వార్తలువిషాదం.. చనిపోతూ తోటి సిబ్బంది ప్రాణాలు కాపాడారు?

విషాదం.. చనిపోతూ తోటి సిబ్బంది ప్రాణాలు కాపాడారు?


శ్రీశైలం జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కెపాటికీ మించి విద్యుత్ ఉత్పత్తి కావడంతో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమదంలో ఈ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 20మంది సిబ్బంది చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది, ఎన్టీఆర్ఎఫ్ బృందం మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన 10మందిని అధికారులు కాపాడి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడంతో విషాదచాయలు నెలకొన్నాయి.

Also Read: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై అనుమానం?

అయితే ఈ ప్రమాదంపై ముగ్గురు అధికారులు ముందుగా హెచ్చరించి మిగతా సిబ్బందిని అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై వారు ముందుగా సిబ్బందిని అప్రమత్తం చేయకపోతే మరింత ప్రాణనష్టం జరిగి ఉండేదని సమాచారం. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఏఈలు మోహన్, ఉజ్మఫాతిమా, సుందర్‌లు మిగిలిన ఉద్యోగులు, సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ‘తాను ఐదు నిమిషాల్లో చనిపోతున్నా ఎవరూ నా దగ్గరకు రావొద్దని’ ఏఈ మోహన్ హెచ్చరించారని తోటి ఉద్యోగులు వెల్లడించారు.

ఇదేవిధంగా సుందర్‌, ఫాతిమా బేగం కూడా విద్యుత్ కేంద్రంలోని అగ్నిప్రమాదంపై తోటి ఉద్యోగులను అప్రతమత్తం చేసి బయటకి పంపించారు. ఈక్రమంలో వీరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఏఈ మోహన్ ఈ మధ్యనే కరోనాను జయించి విధులకు హాజరయ్యారు. అయితే అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ సంఘటనపై ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Also Read: ఎమ్మెల్సీ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఈ అగ్ని ప్రమాదంలో డీఈ శ్రీనివాస్ గౌడ్( హైదరాబాద్), ఏఈ శ్రీనివాస్ గౌడ్(హైదరాబాద్) ఏఈ వెంకట్‌రావు(పాల్వంచ), ఏఈ మోహన్ కుమార్(హైదరాబాద్), ఏఈ ఉజ్మ ఫాతిమా(హైదరాబాద్), ఏఈ సుందర్ (సూర్యాపేట), ప్లాంటు అటెండెంట్ రాంబాబు(ఖమ్మం), జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ (పాల్వంచ), హైదరాబాద్‌కు చెందిన అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ దుర్మరణం చెందారు. దట్టమైన పోగ కారణంగా ఊపిరి ఆడాక వీరంతా చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ముగ్గురు ఏఈ మిగతా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారంతా ప్రాణాలతో బయటపడినట్లు తోటి సిబ్బంది వాపోయారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version