https://oktelugu.com/

Vaccine for children: పిల్లలకు కరోనా టీకా వచ్చేసింది.. పంపిణీ ఎప్పటి నుంచంటే?

Vaccine for children: కరోనా లాక్ డౌన్ తో దేశంలో విద్యావ్యవస్థ మొత్తం పడకేసింది. విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఏడాదిన్నరగా విద్యార్థుల చదువులు అటకెక్కాయి. ఇప్పటికీ ఆన్ లైన్ పేరిట వారి కండ్లు కాయలు కాసేలా ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ల తెరపై క్లాసులు వినిపిస్తున్న దుస్థితి. ఈ క్రమంలోనే విద్యార్థులకు గుడ్ న్యూస్ అందింది. దేశంలో పిల్లల కోసం కొత్త టీకా వచ్చేసింది.. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే కరోనా టీకా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2021 / 10:40 AM IST
    Follow us on

    Vaccine for children: కరోనా లాక్ డౌన్ తో దేశంలో విద్యావ్యవస్థ మొత్తం పడకేసింది. విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఏడాదిన్నరగా విద్యార్థుల చదువులు అటకెక్కాయి. ఇప్పటికీ ఆన్ లైన్ పేరిట వారి కండ్లు కాయలు కాసేలా ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ల తెరపై క్లాసులు వినిపిస్తున్న దుస్థితి. ఈ క్రమంలోనే విద్యార్థులకు గుడ్ న్యూస్ అందింది. దేశంలో పిల్లల కోసం కొత్త టీకా వచ్చేసింది..

    ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే కరోనా టీకా వేస్తున్నారు. తాజాగా 12 ఏళ్లు దాటిన పిల్లలకు కూడా టీకా వచ్చేసింది. జైడిష్ క్యాడిలా సంస్థ ‘జైకోవ్ డి’ పేరిట ఉత్పత్తి చేసిన టీకా ఈనెల 15వ తేదీ నుంచి దేశీయ మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని వైద్యవర్గాలు తెలిపాయి.

    అయితే కేంద్రప్రభుత్వం ఈ టీకాను కొని దేశంలోని పిల్లలకు ఉచితంగా పంచుతుందా? కేంద్రమే మొత్తం కొని పంపిణీ చేస్తుందా? ప్రభుత్వ వైద్యశాలల్లో ఈ టీకా దొరుకుతుందా? అనే దానిపై ఇంకా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి టీకాను ఉచితంగా మోడీ సర్కార్ ఇస్తుంది. మరి పిల్లలకు పంచుతుందా? వారికి డబ్బులు పెట్టి వేయించుకోవాలా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

    ప్రస్తుతం ఈ టీకాకు ధరను నిర్ణయించాల్సి ఉంది. ఆ తర్వాతే సర్కార్ వైద్యంలో ప్రవేశపెడుతారని.. అందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.

    ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన దృష్ట్యా ఈ టీకా రావడం విద్యార్థులకు గొప్ప వరంగా చెప్పొచ్చు. రాష్ట్రంలో 12 నుంచి 18ఏళ్ల వయసున్న పిల్లలు సుమారు 48 లక్షల మంది ఉంటారని అంచనా.. వీరంతా బహిరంగ మార్కెట్ లో సొంతంగా కొనుగోలు చేసి ఈ టీకాను పొందాల్సి ఉంటుంది. జైకోవ్ డి టీకాను 12 ఏళ్ల పైబడిన పిల్లలకు మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. టీకాకు టీకా మధ్య 28 రోజుల గ్యాప్ ఉండాలి. ఇది సూది మందు కాదు.. చర్మంపై నొక్కడం ద్వారా ఇస్తారు.

    ఇక దేశంలో రెండు సంవత్సరాల పైబడిన పిల్లల కోసం భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేయనున్న టీకా వచ్చే నవంబర్ లో అందుబాటులోకి రావచ్చని వైద్యవర్గాలు చెబుతున్నాయి.