https://oktelugu.com/

మోడీ చాతుర్యానికి దిగొచ్చిన వ్యాక్సిన్ కంపెనీలు

దేశంలో తొలి మేడిన్ ఇండియా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’. భారత ఐసీఎంఆర్ తో కలిసి భారత్ బయోటెక్ ఈ స్వదేశీ టీకాను తయారు చేసింది. భారత ప్రభుత్వ శాస్త్రవేత్తలు ఇందులో పాలుపంచుకున్నారు. అయితే సరిపడా ఉత్పత్తిని కోవాగ్జిన్ చేయకపోవడం.. బ్లాక్ మార్కెట్ కు తరలిపోవడంతో దేశంలో కోవాగ్జిన్ కొరత తీవ్రమైంది. అందుకే నిన్న దేశంలోని మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్ ఫార్ములాను మిగత భారత ఫార్మా కంపెనీలు, ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీలకు ఇవ్వాలని డిసైడ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2021 / 09:30 AM IST
    Follow us on

    దేశంలో తొలి మేడిన్ ఇండియా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’. భారత ఐసీఎంఆర్ తో కలిసి భారత్ బయోటెక్ ఈ స్వదేశీ టీకాను తయారు చేసింది. భారత ప్రభుత్వ శాస్త్రవేత్తలు ఇందులో పాలుపంచుకున్నారు. అయితే సరిపడా ఉత్పత్తిని కోవాగ్జిన్ చేయకపోవడం.. బ్లాక్ మార్కెట్ కు తరలిపోవడంతో దేశంలో కోవాగ్జిన్ కొరత తీవ్రమైంది. అందుకే నిన్న దేశంలోని మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్ ఫార్ములాను మిగత భారత ఫార్మా కంపెనీలు, ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఇదో సంచలన నిర్ణయం.

    ఎందుకంటే భారత్ బయోటెక్ మొదట తను తయారు టీకా ఫార్ములాను బయట కంపెనీలకు భారత ప్రభుత్వానికి కూడా ఇవ్వనని నిరాకరించింది. మాకు ప్రభుత్వం నుంచి సహాయం కొంచెమే అందిందని.. అంతా మేమే తయారు చేశామని.. అందువల్ల మా సాంకేతికతను వేరే వాళ్లతో పంచుకోమని కోవాగ్జిన్ కంపెనీ ఇటీవల స్పష్టం చేసింది.కోవాగ్జిన్ వ్యాక్సిన్ పై మేధో హక్కులు మావేనని కుండబద్దలు కొట్టింది.

    అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ దేశంలో వ్యాక్సిన్ల కొరత.. సరిపడా ఉత్పత్తి చేయని కంపెనీలపై సీరియస్ గా ఉంది. ఈ అపవాదు ప్రభుత్వంపై రావడంతో ఇక కొరఢా ఝలిపించింది. భారత శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ఫార్ములాను రెండు భారత ప్రభుత్వ కంపెనీలు అయిన ‘భారత్ ఇమ్యూనోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఇమ్యూలాజికల్స్ లిమిటెడ్ సంస్థలకు కట్టబెట్టింది. అంతేకాదు మహారాష్ట్రకు చెందిన మాఫ్ కిన్ అనే ప్రైవేటు ఫార్మా కంపెనీతో కూడా ఉత్పత్తి చేయాలని ఫార్ములాను ఇచ్చింది.

    దీంతో దెబ్బకు దిగివచ్చిన భారత్ బయోటెక్ ఈ మూడు కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. కోవాగ్జిన్ ఫార్ములాను కట్టబెట్టింది. ఇక సీరం సంస్థ ‘కోవీషీల్డ్’ ఎగుమతులను కూడా మోడీ సర్కార్ నిషేధించి ముందుగా దేశంలో ఉత్పత్తి అయిన అన్ని వ్యాక్సిన్లను ఇక్కడే పంపిణీ చేయాలని షరతు పెట్టింది. వ్యాక్సిన్ల కొరతను నివారించడమే ధ్యేయంగా మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది.

    అలా మోడీ చాతుర్యంతో దేశంలో వ్యాక్సిన్ల కొరత తీర్చడమే కాదు.. కోవిడ్ వ్యాక్సిన్ కంపెనీల ఆటను కట్టడి చేశాడు. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ లపై మేధో హక్కులు ఉండరాదని ప్రపంచవ్యాప్తంగా భారత్ డిమాండ్ చేస్తోంది. దాన్ని దేశంలో చేసి చూపించింది.