https://oktelugu.com/

పోలవరం ఎన్నటికి పూర్తయ్యేనో?

పోలవరం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మాదింది. ఆంధ్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. పనులైతే మందకొడిగానే సాగుతున్నాయి. దీంతో పోలవరం మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది. ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. ఏ ప్రభుత్వం వచ్చినా పనులు వేగం అందుకోకపోవడంతో నిరాశే మిగులుతోంది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సీఎం జూన్ 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు. దీంతో ఆ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 3, 2021 / 09:39 AM IST
    Follow us on

    పోలవరం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మాదింది. ఆంధ్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. పనులైతే మందకొడిగానే సాగుతున్నాయి. దీంతో పోలవరం మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది. ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. ఏ ప్రభుత్వం వచ్చినా పనులు వేగం అందుకోకపోవడంతో నిరాశే మిగులుతోంది.

    జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సీఎం జూన్ 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతోపాటు మంత్రి అనిల్ పోలవరం పర్యటనకు వెళ్లారు. పోలవరం అంశంపై గత రెండేళ్లలో ఏం జరిగిందన్న దానిపై చర్చలు ప్రారంభమయ్యాయి.

    మంత్రి అనిల్ గతంలో జూన్ 2021కి పోలవరం పూర్తి చేస్తాం అని చెప్పారు. బుల్లెట్ దింపుతాం అంటూ సినిమా డైలాగులు చెప్పారు. వాటినే ఇప్పుడు ప్రజలు గుర్తు చేస్తున్నారు.ఇప్పుడువారు చెప్పిన సమయం పూర్తయింది. రెండేళ్లలో రెండు శాతం పనులు కూడా ముందుకు సాగలేదు. దీంతో అసలు ప్రాజెక్టు భవితవ్యంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రివర్స్ టెండర్లతో వందల కోట్ల ఆదా అంటూ కాంట్రాక్టర్లను మార్చేసిన సర్కారు రెండేళ్లు తిరగకుండానే రూ.3 వేల కోట్ల అదనపు చెల్లింపులకు అనుమతి ఇచ్చింది.

    కేంద్రం చేసిన పనులకు నిధులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. సవరించిన అంచనాలను ఆమోదింప చేసుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. చివరికి కొత్తగా పోలవరం నుంచి డెడ్ స్టోరేజీ నుంచి నీరు ఎత్తిపోతలకు ఆమోదం తెలిసి ఓ ఎత్తిపోతలకు మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. పోలవరం అంటే ఏపీ జీవనాడిగా మారనుంది. ప్రాజెక్టు రాజకీయాలకు సమిధగా మారడం ప్రజల్నిఆవేదనకు గురి చేస్తోంది.