మాజీ భర్తను ఉఫ్ అంటున్న ‘ఆదితి రావు’ !

బాలీవుడ్ బ్యూటీ ‘ఆదితి రావు హైదరి’కి ఆల్ రెడీ పెళ్లి అయిందనే విషయమే చాలామందికి తెలియదు. ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఎన్నడూ ఎప్పుడూ పెదవి విప్పిన పాపాన పోలేదు ఈ ముదురు భామ. అయితే తనకి పెళ్లి అయిన విషయం బయట పెట్టకపోయినా బాలీవుడ్ మీడియా మాత్రం ఆదితి పెళ్లి గురించి, అలాగే ఆమె తన భర్తతో విడిపోయిన విషయం గురించి ఎప్పుడో పబ్లిక్ చేసింది. కానీ అదితి మాత్రం తానూ సింగిల్ గర్ల్ ని […]

Written By: admin, Updated On : June 3, 2021 9:18 am
Follow us on

బాలీవుడ్ బ్యూటీ ‘ఆదితి రావు హైదరి’కి ఆల్ రెడీ పెళ్లి అయిందనే విషయమే చాలామందికి తెలియదు. ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఎన్నడూ ఎప్పుడూ పెదవి విప్పిన పాపాన పోలేదు ఈ ముదురు భామ. అయితే తనకి పెళ్లి అయిన విషయం బయట పెట్టకపోయినా బాలీవుడ్ మీడియా మాత్రం ఆదితి పెళ్లి గురించి, అలాగే ఆమె తన భర్తతో విడిపోయిన విషయం గురించి ఎప్పుడో పబ్లిక్ చేసింది.

కానీ అదితి మాత్రం తానూ సింగిల్ గర్ల్ ని అనే ఇమేజ్ ను మెయింటైన్ చేస్తూ ఉంది. అసలు ఇంతకీ అదితి పెళ్లి చేసుకుంది ఎవర్ని అంటే..సత్యదీప్ మిశ్రాని. అతనిని అదితి కొన్నేళ్ల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకుందని, మూడేళ్లు కాపురం కూడా చెసిందని కానీ అతనితో సెట్ అవ్వక ఆ తర్వాత ఆమె భర్త నుండి విడిపోయిందని తెలుస్తోంది.

అయితే ఎప్పుడో గడించిన పోయిన ఈ వ్యవహారం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అదితి పెట్టిన ఒక కామెంట్ కారణంగా మళ్ళీ అదితి పెళ్లి హాట్ టాపిక్ అయింది. అదితి తన ఇన్ స్టాగ్రామ్ ఫోటో పై కామెంట్ చేసింది. ఆ కామెంట్ కాస్త వైరల్ అయింది. ఆదితి, సత్యదీప్ మిశ్రా ఫోటోకి రెస్పొండ్ అవుతూ ‘ఉఫ్…’ అంటూ ఓ కామెంట్ పెట్టింది.

ఈ ‘ఉఫ్’కి మీనింగ్ ఏమిటో అదితికే తెలియాలి. ఏది ఏమైనా ఈ కామెంట్ ను నెటిజన్లు తెగ వైరల్ చేశారు. మాజీ భర్త ఫోటోలకు ఆదితి కామెంట్ పోస్ట్ చేసింది అంటూ పలు పత్రికలు కూడా వార్తలు ప్రచురించడంతో మొత్తానికి మరోసారి అదితికి పెళ్లి జరిగిందనే విషయం తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసింది. సత్యదీప్ ని 2009లో పెళ్లి చేసుకుని 2013లో అతనికి దూరం అయిందట.