Homeజాతీయ వార్తలుUttarakhand youth in Russia war: చదువుకుందామని పోతే.. చావుకు ఎదురెళ్లమన్నారు..!

Uttarakhand youth in Russia war: చదువుకుందామని పోతే.. చావుకు ఎదురెళ్లమన్నారు..!

Uttarakhand youth in Russia war: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం దాదాపు మూడేళ్లుగా కొనసాగుతోంది. ఇరువైపులా భారీగా నష్టం జరిగింది. యుద్ధరగంలో సైనికులు ప్రాణాలు వదులుతున్నారు. ఇక వేల కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసంమయ్యాయి. అయినా యుద్ధం ఆపడం లేదు. మరోవైపు ఎక్కువ కాలం యుద్ధం చేయడం కారణంగా సైనికులు అలసిపోతున్నారు. ఈ క్రమంలో రష్యా.. దొరికిన వారిని దొరికినట్లు యుద్ధరంగంలోకి దింపుతోంది. తాజాగా ఉన్నత చదువు కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థికి కూడా గన్‌ ఇచ్చి.. చావుకు ఎదురెళ్లమని ఆదేశించిది. ఈ సంఘటన రష్యా ఆర్మీలో విదేశీయుల భర్తీకరణపై పెరుగుతున్న ఆందోళనలకు కారణమవుతోంది. భారత, రష్యా మధ్య దౌత్య సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ, ఈ ఘటనలు భారతీయుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

విద్యార్థి వీసా నుంచి సైనిక శిబిరం వరకు..
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌ సింగ్‌ నగర్‌కు చెందిన 30 ఏళ్ల రాకేశ్‌ కుమార్, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో చేరేందుకు ఆగస్టు 7న స్టూడెంట్‌ వీసాపై మాస్కోకు చేరుకున్నాడు. అక్కడి కొన్ని రోజుల్లోనే అధికారులు యుద్ధ మైదానంలో పాల్గొనేలా ఒత్తిడి చేశారని అతను కుటుంబానికి తెలిపాడు. ఆగస్టు 30న ఆర్మీలో బలవంతంగా చేర్చబడ్డానని, త్వరలో ఉక్రెయిన్‌ ఫ్రంట్‌లైన్‌కు తరలించబడతానని చెప్పాడు. తర్వాత రష్యన్‌ యూనిఫాంలో అతని ఫోటోలు కుటుంబానికి చేరాయి. చివరి సంప్రదింపంలో, డాన్‌బాస్‌ ప్రాంతంలో సైనిక శిక్షణ పొందానని, పాస్‌పోర్ట్, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపాడు. సెప్టెంబర్‌ ప్రారంభం నుంచి సంప్రదింపాలు మూసేశారు, ఇది కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన రష్యాలో విదేశీయులను మోసపూరిత హామీలతో ఆకర్షించి యుద్ధానికి పంపడం ఎలా జరుగుతుందో చూపిస్తోంది.

రష్యా సైన్యంలో భారతీయులు..
రాకేశ్‌ కేసు ఒక్కటి మాత్రమే కాదు, ఇటీవల 20 మందికి పైగా భారతీయులు ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులు ఉద్యోగాలు లేదా చదువు హామీలతో రష్యాకు వెళ్లి, ఆర్మీలో బలవంతంగా చేర్చబడ్డారు. లుధియానాలోని సమర్జిత్‌ సింగ్, మోగాలోని బూటా సింగ్, హల్ద్వానీలోని తస్లీమ్‌ వంటి వారు ఉక్రెయిన్‌ మైదానాలకు తరలించబడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ట్రెండ్‌ 2022 నుంచి కొనసాగుతోంది, రష్యా తన సైన్యాన్ని బలోపేతం చేయడానికి విదేశీయులను ఉపయోగిస్తోంది. ఈ మోసాలు వీసా మార్గాల ద్వారా జరుగుతున్నాయి, ఇది భారతీయ యువతను ప్రమాదాల్లోకి నెడుతోంది.

భారత ప్రభుత్వ చర్యలు..
బాధిత కుటుంబం విదేశీ వ్యవారాల శాఖ ద్దారా మాస్కోలోని భారత రాయబారి కార్యాలయానికి వేడుకోలు చేసింది. ఇటీవల రష్యాకు భారతీయుల భర్తీకరణను ఆపమని హెచ్చరించింది. ఈ కేసుల్లో దౌత్య జోక్యం చేస్తోంది. హర్యానా ప్రభుత్వం కూడా కొన్ని కేసుల్లో సహాయం అందిస్తోంది. అయితే, రష్యా–భారత సంబంధాలు ఆయుధాలు, ఎనర్జీ వంటి రంగాల్లో బలంగా ఉన్నందున, ఈ సమస్యలు దౌత్య సమతుల్యతను పరీక్షిస్తున్నాయి. ప్రభుత్వం భవిష్యత్తులో విదేశీయుల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular