Job Vs Business: ఒకప్పటి కంటే ఇప్పుడు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అందుకే దాదాపు అందరూ ఏదో ఒక డిగ్రీని పొందుతున్నారు. అయితే నేటి యువతకు కొత్త సమస్య ఎదురవుతుంది. చదువు పూర్తయిన తర్వాత జాబ్ చేయడమా? వ్యాపారం చేయడమా? అనే కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు. బాగా చదివిన తర్వాత జాబ్ చేయాలని అనుకునేవారు రెగ్యులర్గా నెల నెల జీతం పొందుతూ ఉంటారు. కానీ ఇలా జాబ్ చేయాలనుకునే వారు డ్రీమ్స్ పెట్టుకుంటే మాత్రం షూట్ కాదు. ఎందుకంటే జీవితంలో ఏదైనా సాధించాలని అనుకునే వారికి జాబ్ సూట్ కాదు. వ్యాపారమే కరెక్ట్. మరి ఆ వ్యాపారం చేయాలంటే ఏం చేయాలి? అయితే అంతకుముందు ఈ చిన్న స్టోరీ చదవండి..
మనం ఇప్పుడు అడవుల్లో కంటే ఎక్కువగా ఇళ్ల మధ్యనే కోతులను చూస్తూ ఉన్నాం. కొందరు దయా హృదయంతో కోతులకు ఏదైనా ఆహారం పెట్టాలని అనుకుంటారు. కోతులు ఎక్కువగా అరటి పండ్లను ఇష్టపడుతూ ఉంటాయి. అయితే కోతి దగ్గరికి వెళ్లి ఒక చేత అరటి పండ్లను.. మరో చేత డబ్బులను చూపిస్తే.. కోతి ముందుగా అరటి పండ్లను మాత్రమే తీసుకుంటుంది. కానీ డబ్బుతో ఇంకా ఎక్కువగా అరటి పనులు వస్తాయని విషయం తెలియదు. అలాగే మనుషులు కూడా కొంతమంది జాబ్ కోసం ఒక రూటు.. వ్యాపారం కోసం మరో రూటు ఏర్పాటు చేస్తే.. ఎక్కువ శాతం జాబ్ రూట్లోనే వెళుతూ ఉంటారు. ఎందుకంటే వ్యాపారం చేయాలని ఆలోచన చాలామంది యువతలో తక్కువగా ఉంది.
వాస్తవానికి నార్మల్గా జీవితం గడపాలని అనేవారికి ఉద్యోగం బాగుంటుంది. కానీ జీవితంలో ఏదైనా సాధించాలి.. మిగతా వారి కంటే భిన్నంగా ఉండాలని ఆలోచించేవారు మాత్రం ఉద్యోగం రూట్ అస్సలు ఎంచుకోకూడదు. ఎందుకంటే ఉద్యోగం చేస్తూ డ్రీమ్స్ సాధించాలని అనుకోవడం అస్సలు సాధ్యం కాదు. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకునే క్రమంలో ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారం వైపు వెళ్లడమే ఉత్తమమైన మార్గం. అయితే ఈ వ్యాపారం లో విజయం సాధించడం అంత సులువేం కాదు. అందుకు ఓపిక, ధైర్యం, సమయస్ఫూర్తి అన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా ఎంచుకున్న వ్యాపారం సరైనది ఉండాలి. ఇలా అన్ని రకాలుగా లక్షణాలను ఏర్పాటు చేసుకుంటేనే విజయవంతమైన వ్యక్తిగా ఉండగలుగుతారు.
ఉద్యోగం కూడా చాలామందికి అవసరమే. కానీ ఒక స్థాయిలో డబ్బు సంపాదించిన తర్వాత జీవితంలో సాధించాలన్న తపన చాలామందికి ఉంటుంది. ఇలాంటివారు వ్యాపారం ద్వారానే తమ జీవితంలో ఏదైనా సాధించగలరు. అంతేకాకుండా ఉద్యోగం, వ్యాపారం రెండు చేయాలని అనుకోవడం కూడా అసలైన ఆలోచన కాదు. ఇక వ్యాపారం చేయాలని అనుకునేవారు ఇలా ప్లేట్లో పెట్టగానే అలా లాభాలు రావాలని అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే ఒక వ్యాపారం సక్సెస్ కావాలంటే చాలా సమయం పడుతుంది. అందుకు ఎంతో ఓపిక ఉండాలి. ఇలాంటి ప్రత్యేక లక్షణాలు ఉన్నవారు మాత్రమే వ్యాపారం వైపు చూడాలి. మరోవైపు ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారు మాత్రమే వ్యాపారం జోలికి వెళ్లడం మంచిది.