YCP MLAs vs Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్ ఇండియా స్థాయిలో పవన్ నటించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. విదేశాల్లో సైతం ప్రేక్షకులు ఆశగా ఎదురు చూశారు ఈ చిత్రం కోసం. పవన్ ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయడంతో అంచనాలు పెరిగాయి. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందని పవన్ అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఈ అర్ధరాత్రి బెనిఫిట్ షో లతో సినిమా విడుదల కానుంది. దీంతో అంతటా సందడి నెలకొంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. అప్పుడే దుష్ప్రచారం ప్రారంభించింది.
అంబటి రాంబాబు సెటైరికల్ విషెస్..
పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైనప్పుడు సెటైరికల్ గా శుభాకాంక్షలు తెలపడం మాజీమంత్రి అంబటి రాంబాబుకు ఒక అలవాటుగా మారిపోయింది. ఓజీ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అంబటి రాంబాబు ఆకాంక్షించారు. అలా అంటూనే పవన్ నటించిన రెండు చిత్రాలు ప్లాఫ్ అయ్యాయని చెప్పు వచ్చారు. అందుకే పవన్ కళ్యాణ్ కసిగా ఈ సినిమాలో నటించారని.. దర్శకుడు కూడా ప్రతిభావంతుడని చెప్పొచ్చారు. ఒకవేళ సినిమా హిట్ అయితే దర్శకుడు చలువే అన్నట్టు అంబటి రాంబాబు అభిప్రాయం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అవినీతి గురించి మాట్లాడేవారని.. ఇప్పుడు ఆయన నటించిన సినిమా టికెట్ 1000 రూపాయలకి పెంచుకోవడం అవినీతి కాదా అంటూ సెటైరికల్ గా మాట్లాడారు అంబటి రాంబాబు.
ఒంటరిగా గెలవలేనివారా?
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆసక్తి కర ట్వీట్ చేశారు. ఓజి అంటే.. ఒంటరిగా గెలవలేనోరా అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహార శైలిపై జనసైనికులు ఆగ్రహం గా ఉన్నారు. మీరు ఎంతగా తప్పుగా మాట్లాడితే అంతగా పవన్ కళ్యాణ్ కు ప్రచారం లభిస్తుందని.. సినిమాలు జయ అపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షక ఆదరణ పొందిన ఒకే ఒక నటుడు పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ అవుతాయని చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు అనేసరికి వైసీపీ నేతలు ఇలా దుష్ప్రచారం చేయడాన్ని మాత్రం జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పవన్ జి… “OG”
సూపర్ డూపర్ హిట్టై
దానయ్యకు దండిగా ధనం
రావాలని కోరుకుంటున్నాను !@DVVMovies @PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) September 24, 2025