మంచు కరిగితే.. ముంచడమే‘నా’..

కళ్లుమూసి తెరిచేలోపు చుట్టూ నీళ్లూ.. మునిగిపోతున్న ఇళ్లు.. కొట్టుకుపోతున్న వాహనాలు.. మనుషులు. ఇలాంటి పకృతి వైఫరీత్యాలు మనం ఎక్కవుగా.. హాలీవుడ్ సినిమాల్లోనే చూస్తుంటాము. కానీ ఇవి నిజజీవితంలోనూ అనుభవించాల్సి క్షణాలు వస్తుండడం మన దురదృష్టం.. ఇలాంటి విపత్తే.. ఆదివారం ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. అప్పటి వరకు నిర్మలంగా నిశ్శబ్ధంగా కొనసాగిన.. ధౌలిగంగా నది ఒక్కసారిగా విరుచుకు పడింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు సమీపంలో ఉన్నవారంతా.. నదీ ప్రవాహానికి కొట్టుకుపోయారు. డ్యాములు రూపురేఖలు లేకుండా కొట్టుకుపోయాయి. పవర్ […]

Written By: Srinivas, Updated On : February 8, 2021 3:04 pm
Follow us on


కళ్లుమూసి తెరిచేలోపు చుట్టూ నీళ్లూ.. మునిగిపోతున్న ఇళ్లు.. కొట్టుకుపోతున్న వాహనాలు.. మనుషులు. ఇలాంటి పకృతి వైఫరీత్యాలు మనం ఎక్కవుగా.. హాలీవుడ్ సినిమాల్లోనే చూస్తుంటాము. కానీ ఇవి నిజజీవితంలోనూ అనుభవించాల్సి క్షణాలు వస్తుండడం మన దురదృష్టం.. ఇలాంటి విపత్తే.. ఆదివారం ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. అప్పటి వరకు నిర్మలంగా నిశ్శబ్ధంగా కొనసాగిన.. ధౌలిగంగా నది ఒక్కసారిగా విరుచుకు పడింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు సమీపంలో ఉన్నవారంతా.. నదీ ప్రవాహానికి కొట్టుకుపోయారు. డ్యాములు రూపురేఖలు లేకుండా కొట్టుకుపోయాయి. పవర్ ప్లాంటులు ఆనవాళ్లు లేకుండా పోయాయి.

Also Read: ఉన్నవాటికే దిక్కులేదు.. మళ్లీ కొత్త పథకాలా..?

ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ లో హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ తరహాలోనే పర్వతాలు ఎక్కవ. అక్కడ మంచు పర్వతాలు అధికం. ఆ మంచు పర్వతాలు నెమ్మదిగా కరుగుతుంటాయి. కానీ ఒక్కసారిగా.. ఆ హిమాది నదం విరిగిపడడంతో వరదలు వచ్చేశాయి. ఈ వరదల కారణంగా తపోవన్లోని రుషిగంగాపవర్ ప్రాజెక్టు నీట మునిగింద. అందులో పని చేస్తున్నదాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. పదహారు మందిని ఒక చిన్న గుంత నుంచి కాపాడారు. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో జెషిమఠ్.. మలరి వంతెన కొట్టుకుపోయింది. భారత సైతం సరిహద్దు ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ వంతెనను ఉపయోగిస్తుంటారు.

2013లోనూ ఇక్కడ ఇలాంటి వదరలే వచ్చాయి. అప్పుడు వరదలు ఉప్పొంగిన చోట ఇప్పుడు కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అలకనంద ప్రాంతంలో వరదలు సంభవించే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నదీ పరీవాహక ప్రాంతాల వెంట నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైన్యాన్ని రంగంలోకి దించారు. దిగువన ఉన్న శ్రీనగర్, హృషీకేశ్ డ్యామ్ లను ఖాళీ చేయిస్తున్నారు.

Also Read: టీఆర్‌‌ఎస్‌ మెతక వైఖరి..: రెచ్చిపోతున్న బీజేపీ

ఉత్తరాఖండ్ రాష్ట్రం దిగువన ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా వరదల నేపథ్యంలో అలర్ట్ అయ్యింది. గంగానది పరీవాహన ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రకృతికి మానవాళి చేస్తున్న హాని కారణంగానే ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే.. పదేపదే అందరూ చెప్పే విషయం ఇదే.. అంగీకరించే అంశం కూడా ఇదే..కానీ ఈ విషయంలో తప్పులను దిద్దుకునే ప్రయత్నం చేయరు ఎవరూ.. తప్పుల మీద తప్పులు చేస్తూ.. పోతుంటారు. దానివల్లనే ఈ వైఫరీత్యాలు జరుగుతున్నాయి.

మరిన్ని జాతీయం రాజకీయ వార్తల కోసం జాతీయం పాలిటిక్స్