https://oktelugu.com/

ఉన్నవాటికే దిక్కులేదు.. మళ్లీ కొత్త పథకాలా..?

చాలా రోజుల తర్వాత నిన్న టీఆర్‌‌ఎస్‌ కార్యవర్గ సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ చాలా మాటలు మాట్లాడారు. అందులో ముఖ్యంగా త్వరలో మరికొన్ని అద్భుత పథకాలు ప్రవేశ పెట్టబోతున్నామని చెప్పుకొచ్చారు. ఓ వైపు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టి.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలుు చేయలేని పరిస్థితి ఉంది. ఇంతవరకు రుణమాఫీ లేదు. రైతు బంధు పథకం ఎప్పుడిస్తే అప్పుడు తీసుకోవాలన్నట్లుగా మారింది. నిరుద్యోగభృతి సహా అనేక పథకాలు ప్రకటనలకే పరిమితయ్యాయి. మరోవైపు అప్పులకు […]

Written By: , Updated On : February 8, 2021 / 02:21 PM IST
Follow us on

KCR
చాలా రోజుల తర్వాత నిన్న టీఆర్‌‌ఎస్‌ కార్యవర్గ సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ చాలా మాటలు మాట్లాడారు. అందులో ముఖ్యంగా త్వరలో మరికొన్ని అద్భుత పథకాలు ప్రవేశ పెట్టబోతున్నామని చెప్పుకొచ్చారు. ఓ వైపు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టి.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలుు చేయలేని పరిస్థితి ఉంది. ఇంతవరకు రుణమాఫీ లేదు. రైతు బంధు పథకం ఎప్పుడిస్తే అప్పుడు తీసుకోవాలన్నట్లుగా మారింది. నిరుద్యోగభృతి సహా అనేక పథకాలు ప్రకటనలకే పరిమితయ్యాయి. మరోవైపు అప్పులకు కట్టాల్సిన వాయిదాల మొత్తం పెరిగింది. ఆదాయం పడిపోయింది.

Also Read: టీఆర్‌‌ఎస్‌ మెతక వైఖరి..: రెచ్చిపోతున్న బీజేపీ

గతేడాది లక్షా 80 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ.. కరోనా దెబ్బకు మొత్తం తేడా కొట్టేసింది. సర్కార్ ఖజానాకు 50 వేల కోట్ల వరకు రావాల్సిన ఆదాయం గండిపడిందని కేసీఆర్ చాలాసార్లు ప్రకటించారు. ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేష్లను కరోనా కారణంగా నిలిచిపోవడం ఆ తర్వాత ధరణి పోర్టల్‌తో సర్కారు కొంతకాలం నిలిపివేయడంతో ఆదాయానికి భారీగా గండిపడింది. ఆస్తి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10,000 కోట్లు సంపాదించాలని బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకోగా.. సగం కూడా రాలేదు. అయితే.. ఈ కారణంగా చెప్పి సంక్షేమ పథకాలను ఆపేస్తే ప్రజల్లో ఆగ్రహం వస్తుంది. అందుకే.. అప్పులు చేసి ఎలాగోలా ఉన్న పథకాలను నెట్టుకొస్తున్నారు.

Also Read: చిరుతో ఈటల భేటీ..: ఏంటీ రహస్యం

ఇప్పుడు.. టీఆర్ఎస్‌కు ఎదురీదే పరిస్థితి వచ్చింది. పాత హామీలన్నీ అమలు చేయాల్సిన పరిస్థితి. లేకపోతే వ్యతిరేకత మరింత పెరుగుతుంది. అందుకే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. అది బడ్జెట్‌లో ప్రకటించాల్సి ఉంది. ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి ఉంది. వీటన్నింటికి తోడు మరికొన్ని అద్భుత పథకాలంటూ కేసీఆర్ ప్రకటనలు చేస్తున్నారు. చెప్పిన వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మళ్లీ కొత్త పథకాలంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని టీఆర్ఎస్ వర్గాలే అనుకుంటున్నాయి. మరి కేసీఆర్ ఈ విషయంలో ఏ మ్యాజిక్ చేస్తారో చూడాలి.

ఇప్పటికే ఉన్న పథకాలను అమలు చేయలేక అవస్థలు పడుతున్న కేసీఆర్‌‌ సర్కార్‌‌.. మళ్లీ కొత్త పథకాలంటూ ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలియకుండా ఉంది. దీనిపై ప్రతిపక్షాలు సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్