
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మొదటిసారి వైవిధ్యమైన కథతో రాబోతున్న ‘పుష్ప’ సినిమా పై ఇప్పటికే అంచనాలు అత్యున్నత స్థాయికి చేరాయి. అసలు వీరి కలయిక అంటేనే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది ఇప్పుడు పుష్ప సినిమా పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా కోసం బన్నీ బాగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే తన లుక్ ను మార్చిన బన్నీ.. తాజాగా తోడేలులా ఎలా పరిగెత్తాలో ఎలా దాడి చేయాలో నేర్చుకుంటున్నాడు.
సినిమా కథ ప్రకారం బన్నీ ఎక్కువగా అడవిలో ఉంటాడు కాబట్టి, తోడేలులా అడ్డు వచ్చిన వారి పై దాడి చేస్తాడట. మరి చూడాలి సుకుమార్, ఈ ఫైట్ ను ఎలా కొత్తగా ప్లాన్ చేశాడో. వచ్చే వారం నుండి ఈ సీక్వెన్స్ షూట్ చేస్తారట. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ లో బన్నీ అడవి నేపథ్యంలో పూర్తి రఫ్ లుక్ లో అదిరిపోయేలా ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమాలో బన్నీ రెడ్ శాండల్ స్మగ్లర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్యారెక్టర్ కోసం కంప్లీట్ డీగ్లామర్ లుక్ చేసుకున్నారు బన్నీ.
కాగా భారీ బడ్జెట్ కేటాయించి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సెన్సేషన్ హీరోయిన్ రష్మీక కథానాయకిగా నటిస్తోంది. ‘రంగస్థలం’ చిత్రం తర్వాత సుకుమార్ రెండేళ్లపాటు నిరీక్షించి బన్నీతో ఈ సినిమా కమిటయ్యాడు. పైగా బన్నీ కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ ను డిజైన్ చేశాడట. అలాగే ఈ సినిమాలో మరో స్పెసల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.