Uttar Pradesh: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచం నలుమూలలా ఎక్కడ ఏం జరిగిన కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది.ఈ క్రమంలోనే ఒక ఆశ్చర్యకరమైన ఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఒక వ్యక్తిని ఒక పాము నెలన్నర వ్యవధిలో ఆరు సార్లు కాటు వేసింది.అదృష్టం బాగుండి ఆ వ్యక్తి ప్రతి సారీ ప్రాణాలతో బయట పడుతున్నారు.అయితే ఇందులో అందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే పగ పట్టిన ఆ పాము అతడిని వేటాడి రెండు ప్రత్యేక రోజుల్లోనే కాటు వేస్తుంది.ఆ వ్యక్తి ఆ పాము నుంచి తప్పించుకోవడానికి ఊరు మారినప్పటికీ లాభం లేకపోయింది.
పాము ఆ వ్యక్తిని వేటాడి పొరుగూరికి కూడా వెళ్లి కాటు వేస్తుంది.ఇలా మొత్తం ఆరు సార్లు ఆ పాము కాటు వేసింది.పాము కాటు వేసిన ప్రతి సారీ ఆ వ్యక్తి ఆసుపత్రి లో చికిత్స పొందటం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో జరిగింది.యూపీ లోని ఫతేపూర్ లో ఈ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది.పాము కు భయపడి ఆ వ్యక్తి తన ఇల్లు వదిలి తన మామ ఇంట్లో ఉంటున్నప్పటికీ ఆ పాము అతనిని వదలలేదు.దాంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
వికాస్ దూబే అనే వ్యక్తి నెలన్న వ్యవధిలో ఆరు సార్లు పాము కాటుకు గురయ్యాడు.జూన్ 2 న రాత్రి 9 గంటలకు మంచం మీద నుంచి లేస్తూ కాలు కింద పెట్టగానే అతనిని మొదటి సారీ పాము కాటు వేసింది.రెండు రోజులు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స తర్వాత అతను కోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు.ఇది ఒక సాధారణ ఘటన అని అతని కుటుంబసభ్యులు భావించారు.అయితే జూన్ 10 న మళ్ళీ అతనిని పాము కాటు వేసింది.చికిత్స తర్వాత మళ్ళీ కోలుకున్న వికాస్ కు మనసులో పాముల భయం ఏర్పడింది.ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కూడా ఈ సారి మళ్ళీ అతనిని జూన్ 17 న ఇంట్లోనే పాము కాటు వేసింది.
మళ్ళీ మూడు రోజుల తర్వాత నాల్గవ సారీ పాము కాటు వేసింది.చికిత్స కోసం అతనిని మళ్ళీ అదే ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు.ఈసారి ప్రాణాలతో బయటపడిన అతను తన బంధువుల సూచించినట్లు రాధనగర్ లోని తన మేనత్త ఇంటికి వెళ్ళాడు.అక్కడ కూడా రాత్రి 10 గంటల సమయంలో మళ్ళీ పాము కాటు వేసింది.మళ్ళీ చికిత్స నుంచి కోలుకున్న తర్వాత అతను మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని తన మామ సంతోష్ దూబే ఇంటికి వెళ్ళాడు.అయితే జులై 6 తేదీన మధ్యాహ్నం మళ్ళీ తన మామ ఇంట్లో పాము ఆరో సారీ కాటు వేసింది.ఆసుపత్రిలో చేరిన అతను చికిత్స తర్వాత కోలుకొని ఇంటికి వెళ్ళాడు.అయితే ప్రతి సారీ తనను పాము శని,ఆది వారాల్లో కాటు వేస్తుందని అతడు చెప్పుకొచ్చాడు.ప్రతి సారి అతని ఒంటిపై పాము కాటువేసిన కొత్త గుర్తులు ఉంటున్నాయని వైద్యులు తెలిపారు.పాము కాటు వేసిన ప్రతి సారీ అతనికి యాంటీ స్నేక్ వెనం ఎమర్జెన్సీ మందులు ఇస్తున్నామని వైద్యులు తెలిపారు.