Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Brinda OTT: త్రిష అలా నటించిన తొలి వెబ్ సిరీస్ వస్తోంది.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు...

Brinda OTT: త్రిష అలా నటించిన తొలి వెబ్ సిరీస్ వస్తోంది.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు అంటే?

Brinda OTT: సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం క్రేజీ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది లియో చిత్రంతో సూపర్ హిట్ కొట్టింది. 40 ఏళ్ల వయసులో కూడా చెరగని గ్లామర్ మైంటైన్ చేస్తుంది. అయితే ఇప్పటివరకు సినిమాల్లో అలరించిన త్రిష… తొలిసారి ఓటీటీలో అడుగుపెడుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ బృంద

బృంద వెబ్ సిరీస్ టీజర్ తాజాగా విడుదల చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు. బృంద టీజర్ ఆసక్తి రేపుతోంది. ఈర్ష్య, ద్వేషం, కోపంతో కాదు, మనలోని మంచితో మనం పోరాడాలి. చచ్చేవరకు మంచి తనాన్ని కాపాడుకోవాలి… అనే డైలాగ్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. త్రిష సీరియస్ ఇంటెన్స్ రోల్ చేశారని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇక ‘ బృంద ‘ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో ఆగస్టు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ‘ బృంద ‘ సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇంద్రజిత్ సుకుమారన్, జయ ప్రకాష్,ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామీ, రాకేందు మౌళి కీలక పాత్రలు పోషించారు.

సూర్య మనోజ్ వంగాల ‘ బృంద ‘ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఆశిష్ కోళ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక టీజర్ లో డైలాగ్స్ హైలెట్ అని చెప్పాలి. ‘ ఈ ప్రపంచంలో మనం రాకముందు ఎంత చెడైనా ఉండొచ్చు .. కానీ వెళ్లేముందు కొంతైనా మంచి చేసి వెళ్లడం మన బాధ్యత’ అని వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటుంది. ఆగస్టు 2వ తేదీ నుంచి బృంద వెబ్ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఫస్ట్ డిజిటల్ సిరీస్లో త్రిష ఈ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి కి జంటగా నటిస్తుంది. స్టాలిన్ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకి చిరుతో త్రిష జతకడుతుంది. ఆషికా రంగనాథ్ ఇందులో మరో హీరోయిన్ గా నటిస్తుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 17 ఏళ్ల అనంతరం చిరంజీవి-త్రిష జతకడుతున్నారు. గతంలో వీరు స్టాలిన్ చిత్రం చేశారు.

Exit mobile version