https://oktelugu.com/

కలిసొచ్చిన కాలం.. టీపీసీసీలో ఉత్తమ్ దే రాజ్యం

కాలం కలిసిరావడం అంటే ఇదేనేమో.. జాతీయ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత నాయకత్వం సంక్షోభం తెలంగాణ పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలిట వరంగా మారిందన్న ప్రచారం సాగుతోంది. ఏఐసీసీలో తాజాగా సోనియాగాంధీ నాయకత్వాన్ని సీనియర్లు 23మంది వ్యతిరేకించడం.. కాంగ్రెస్ లో తుఫాను చెలరేగడం.. చివరకు మరో ఆరు నెలల వరకు సోనియాగాంధీనే అధినేత్రిగా కొనసాగునుండడంతో ఇప్పట్లో రాష్ట్ర శాఖలను ముట్టుకునే సాహసం కాంగ్రెస్ చేయదు అని ఖాయమైపోయింది. దీంతో  పీసీసీ చీఫ్ గా […]

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2020 / 05:27 PM IST
    Follow us on


    కాలం కలిసిరావడం అంటే ఇదేనేమో.. జాతీయ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత నాయకత్వం సంక్షోభం తెలంగాణ పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలిట వరంగా మారిందన్న ప్రచారం సాగుతోంది. ఏఐసీసీలో తాజాగా సోనియాగాంధీ నాయకత్వాన్ని సీనియర్లు 23మంది వ్యతిరేకించడం.. కాంగ్రెస్ లో తుఫాను చెలరేగడం.. చివరకు మరో ఆరు నెలల వరకు సోనియాగాంధీనే అధినేత్రిగా కొనసాగునుండడంతో ఇప్పట్లో రాష్ట్ర శాఖలను ముట్టుకునే సాహసం కాంగ్రెస్ చేయదు అని ఖాయమైపోయింది. దీంతో  పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డినే మరికొంత కాలం ఉంటాడని తెలుస్తోంది.

    Also Read: అధ్యక్షుడైనా బండి సంజయ్ సంతోషంగా లేడా?

    నిజానికి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం ముగిసిపోవడంతో తనే స్వచ్ఛందంగా వైదొలిగి తన స్థానంలో ఇతరులను నియమించాలని పార్టీ అధిష్టానానికి స్వయంగా లేఖ రాశారు. పార్టీ నాయకత్వం దీనిపై ఢిల్లీ దూతను పంపి పలువురి పేర్లను పీసీసీ చీఫ్ కు సెలెక్ట్ చేసి పంపించింది. పీసీసీ చీఫ్ గా అందరికంటే ముందంజలో రేవంత్ రెడ్డి ఉన్నాడని.. ఆయన పేరును ఖరారు చేసిందనే ప్రచారం సాగింది.

    రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించడానికి అధిష్టానం రెడీ కాగానే కాంగ్రెస్ సీనియర్లు అంతా కూడబలుక్కొని వ్యతిరేకించడంతో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకే పీసీసీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నేతలు కోరడంతో ఇక కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఆలస్యమైంది.

    ఈ క్రమంలోనే జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి 23మంది సీనియర్లు లేఖ రాయడం పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. చివరకు సోనియానే మళ్లీ పార్టీ చీఫ్ గా కొనసాగింది.

    Also Read: టీ.కాంగ్రెస్ కు ఊపుతెచ్చే ప్లాన్ చేశారు?

    ఇంతటి సంక్షోభ పరిణామాలన్నీ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసివచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఏఐసీసీకి కొత్త చీఫ్ వచ్చే వరకు ఉత్తమ్ పదవీకాలానికి ఢోకా ఉండకపోవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు.

    ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఏఐసీసీకి కొత్త చీఫ్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పీసీసీ చీఫ్ కూడా మారే అవకాశాలు లేవు. సోనియాగాంధీ ఏఐసీసీ చీఫ్ గా ఉన్నంతకాలం ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవికి ఢోకా లేదని.. ఆమె మార్చబోదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మరికొంతకాలం ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.