https://oktelugu.com/

బాలయ్య బాబుకు హీరోయిన్ గా జయసుధ !

నందమూరి బాలకృష్ణ భార్యగా సహజ నటి జయసుధ నటించబోతుంది. నట సింహంగా పిలిపించుకునే బాలయ్య బాబు, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ బాలయ్యకు భార్య పాత్ర ఉందట. ఈ పాత్రలో సిమ్రాన్ తీసుకోవాలని మొదట భావించారు. అయితే ఈ మధ్య జయసుధ అందరికీ ఫోన్ చేసి.. మీ సినిమాలో నా కోసం ఒక క్యారెక్టర్ చూడండి… కరోనా అనంతరం షూట్ లో పాల్గొంటాను అని అడుగుతుందట. […]

Written By:
  • admin
  • , Updated On : August 26, 2020 / 05:10 PM IST
    Follow us on


    నందమూరి బాలకృష్ణ భార్యగా సహజ నటి జయసుధ నటించబోతుంది. నట సింహంగా పిలిపించుకునే బాలయ్య బాబు, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ బాలయ్యకు భార్య పాత్ర ఉందట. ఈ పాత్రలో సిమ్రాన్ తీసుకోవాలని మొదట భావించారు. అయితే ఈ మధ్య జయసుధ అందరికీ ఫోన్ చేసి.. మీ సినిమాలో నా కోసం ఒక క్యారెక్టర్ చూడండి… కరోనా అనంతరం షూట్ లో పాల్గొంటాను అని అడుగుతుందట. ఈ క్రమంలో బాలయ్య బాబుకు ఫోన్ వచ్చినట్టు ఉంది. అసలుకే బాలయ్య బాబు ఎప్పుడూ ఎవరికి వరం ఇద్దామా అన్నట్టు ఉంటాడు. జయసుధ అడగటం ఆలస్యం.. వెంటనే బోయపాటి శ్రీనుకి ఆర్డర్ వెళ్ళింది.. ఆ రకంగా జయసుధ బాలయ్య బాబుకు భార్యగా ఫిక్స్ అయింది.

    Also Read: మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్లో కరోనా కలకలం…?

    ఆయితే బోయపాటి సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కి కూడా ఒక సీన్ లో కొంచెం రొమాన్స్ రాసుకున్నాడట. ఓ సాంగ్ కూడా ఉంటుందట. మొదట సిమ్రాన్ అనుకున్నాడు కాబట్టి.. బాలయ్య సిమ్రాన్ ల మధ్య సాంగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుందని లెక్కలు వేసుకున్నాడట. ఇప్పుడు ఈ పాత్రలో జయసుధను పెట్టుకోవాల్సి రావడంతో బోయపాటి, ఈ పాత్ర గురించి జయసుధకు వివరించాడని.. కాస్త సాంగ్ లో కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పగా.. జయసుధ కూడా చేస్తాను అని అంటుందట. మరి ఈ వయసులో జయసుధ, బాలయ్య భార్య పాత్రకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతుందో చూడాలి.

    Also Read: అందరూ ఐపోయారు… ఇక తన జీవితాన్నే సినిమాగా తీస్తున్న ఆర్జీవీ

    ఇక బాలయ్య ముదురు పాత్రకు హీరోయిన్ విషయాన్ని పక్కన పెడితే.. బాలయ్య యంగ్ క్యారెక్టర్ కి హీరోయిన్ మాత్రం దొరకడం లేదు. కొత్త హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నా.. బాలయ్య బాబు పక్కన మరీ ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ ఏం బాగుంటుంది. అందుకే ఇంకా హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే కరోనాకి ముందు ఈ మూవీకి సంబంధించిన ఒక యాక్షన్ షెడ్యూల్ ని కూడా ఫినిష్ చేశారు. కరోనా అనంతరం జరిగే షూట్ లో కూడా హీరోయిన్ పార్ట్ కు సంబంధించిన సీన్స్ ను లేకుండా బోయపాటి షూట్ ప్లాన్ చేస్తున్నాడట. ఏమైనా బాలయ్యకి హీరోయిన్ సమస్య ప్రతి సినిమాకి ఉండేదే. నిజానికి ఈ సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అడిగినా.. బాలయ్య అనేసరికి కాస్త వెనకడుగు వేస్తున్నారట.