https://oktelugu.com/

చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!

విస్తరణ వాదంతో చెలరేగిపోతున్న చైనా దేశానికి గట్టి బుద్ది చెప్పేందుకు అమెరికా రెడీ కావడం ప్రపంచ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ పరిణామం భారత్ కు కొండంత బలాన్ని ఇచ్చినట్టైంది. అంతేకాదు.. దక్షిణాసియా దేశాలకు అమెరికా సాయం చేస్తానని చేసిన ప్రకటన చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. చైనా మన సరిహద్దుల్లో భారీగా బలగాలను, యుద్ధ సామగ్రిని మోహరిస్తోంది. దీంతో భారత్ కూడా 10వేల మంది సైనాన్యి సరిహద్దులకు తరలించింది. మనకు అత్యవసర యుద్ధ సామగ్రిని పంపిణీ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 26, 2020 / 12:35 PM IST
    Follow us on


    విస్తరణ వాదంతో చెలరేగిపోతున్న చైనా దేశానికి గట్టి బుద్ది చెప్పేందుకు అమెరికా రెడీ కావడం ప్రపంచ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ పరిణామం భారత్ కు కొండంత బలాన్ని ఇచ్చినట్టైంది. అంతేకాదు.. దక్షిణాసియా దేశాలకు అమెరికా సాయం చేస్తానని చేసిన ప్రకటన చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

    చైనా మన సరిహద్దుల్లో భారీగా బలగాలను, యుద్ధ సామగ్రిని మోహరిస్తోంది. దీంతో భారత్ కూడా 10వేల మంది సైనాన్యి సరిహద్దులకు తరలించింది. మనకు అత్యవసర యుద్ధ సామగ్రిని పంపిణీ చేయాల్సిందిగా ఇప్పటికే భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యా వెళ్లి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అనూహ్యమైన నిర్ణయం భారత్ కు కొండంత బలాన్ని ఇచ్చినట్టైంది.

    భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

    తాజాగా చైనా భారత్ తోనేకాదు.. దాని పక్కనున్న వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పిన్స్ దేశాలను బెదిరిస్తోంది. వాటికి ముప్పుగా మారింది. నదులు మళ్లిస్తూ ఆర్థికంగా దెబ్బతీస్తూ దక్షిణ చైనా మహాసముద్రంలో సవాళ్లు విసురుతోంది. తాజాగా భారత్ తోనూ కయ్యానికి కాలుదువ్వుతోంది.

    ఈ టైంలోనే తాజాగా అమెరికా సంచలన ప్రకటన చేసింది. భారత్ తోపాటు దక్షిణాసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. చైనాను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ మేరకు జర్మనీలో ఉన్న 52వేల అమెరికన్ సైన్యాన్ని 25వేలకు తగ్గిస్తున్నారు. ఏ ప్రాంతానికైనా ముప్పు ఎదురైతే ఆ దేశాల బాధ్యత తీసుకొని రక్షిస్తామని తెలిపారు.

    చైనా ఎత్తులను చిత్తు చేసేదేలా?

    ఈ నేపథ్యంలో అమెరికా ప్రకటన భారత్ కు ఊరటనిచ్చింది. కయ్యంతో కాలుదువ్వుతున్న చైనా దురాక్రమణకు అమెరికా ప్రకటన షాకింగ్ లా మారింది. చైనాను ఎదుర్కొనేందుకు భారత్ కు బలగాలు పంపేందుకు అమెరికా రెడీ కావడం డ్రాగన్ దేశానికి గుబులు పుట్టిస్తోంది. ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యాన్ని కలిగిన అమెరికా.. భారత్ తో చేతులు కలిపితే చైనా పని ఖతమే. ఈ మారిన అంతర్జాతీయ పరిణామాలతో చైనా ఏ నిర్ణయం తీసుకుంటదనేది ప్రాధాన్యత సంతరించుకుంది..

    -ఎన్నం