https://oktelugu.com/

జగన్ సొంత సామాజిక వర్గంలో మొదలైన అసహనం

మనకు దక్కకపోయినా పర్లేదు…ఎదుటివాడికి ప్రయోజనం కలిగితే మనం ఓర్చుకోలేం…ఇది మనిషి సహజ లక్షణం. ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని వర్గాల ప్రజల తీరు ఇలానే ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి కేవలం ఏడాది మాత్రమే పూర్తి అయ్యింది. ఈ ఏడాది పాలనలో ఆయన అనేక విప్లవాత్మక పథకాల అమలు పూర్తి చేశారు. అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీల నెరవేర్చడంపై దృష్టిపెట్టాడు. దీనిలో భాగం ఆయన విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేశారు. ఇంగ్లీష్ మీడియం అమలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 26, 2020 / 12:23 PM IST
    Follow us on


    మనకు దక్కకపోయినా పర్లేదు…ఎదుటివాడికి ప్రయోజనం కలిగితే మనం ఓర్చుకోలేం…ఇది మనిషి సహజ లక్షణం. ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని వర్గాల ప్రజల తీరు ఇలానే ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి కేవలం ఏడాది మాత్రమే పూర్తి అయ్యింది. ఈ ఏడాది పాలనలో ఆయన అనేక విప్లవాత్మక పథకాల అమలు పూర్తి చేశారు. అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీల నెరవేర్చడంపై దృష్టిపెట్టాడు. దీనిలో భాగం ఆయన విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేశారు. ఇంగ్లీష్ మీడియం అమలు వంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. నవరత్నాలలో ముఖ్యమైన అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలలో రూ. 15వేలు జమచేశారు.

    తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

    వాహన మిత్ర, మత్యకార భరోసా, నేతన్న హస్తం, విద్యా దీవెన వంటి అనేక పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చడం జరిగింది. తాజాగా జూన్24న కాపు నేస్తం పథకం క్రింద ఆర్థికంగా వెనుకబడిన కాపు, తెలగ, బలిజ కులాలకు చెందిన మహిళల ఖాతాలలో రూ. 15 వేలు జమచేయడం జరిగింది. రోజుల వ్యవధిలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థిక మద్దతు ప్రభుత్వం ప్రకటించింది. లబ్దిదారులకు ఆనందం పంచుతున్న ఈ పథకాలు, అనర్హులైన వారిలో అసహనం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన రెడ్డి, కమ్మ, వైశ్య మరియు బ్రాహ్మణ కులాలవారు జగన్ వైఖరి పట్ల మండిపడుతున్నారు.

    మాటల్లో స్నేహం, చర్యల్లో యుద్ధం..వైసీపీ ఎంపీ తీరిదే..!

    ఉన్నత సామజిక వర్గాలకు చెందిన యువత సోషల్ మీడియా వేదికగా జగన్ పై ప్రశ్నలు సంధిస్తున్నారు. మిగతా కులాల సంగతి అటుంచితే జగన్ సొంత సామాజిక వర్గం అయిన రెడ్లలో దీనిపైన తీవ్ర అసంతృప్తి రేగుతుంది. ఆర్ధికంగా వెనుక బడిన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు వారికి కూడా ఎంతో కొంత ఆర్థిక తోడ్పాటు కల్పించాలని కోరుకుంటున్నారు. మరి గత ప్రభుత్వాలు ఇన్నేళ్ళలో ఓసీ వర్గానికి ప్రత్యేకంగా చేసింది ఏమి లేదు. అయినప్పటికీ ఈ సామాజిక వర్గాలు, ఈ విషయంపై ప్రభుత్వాలను ప్రశ్నించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు వీరిలో అసహనం కలగడానికి కారణం మిగతా సామాజిక వర్గాలకు సాయం చేస్తూ ఉండడమే. ఐతే వీరి కోరికలో కూడా న్యాయం లేకపోలేదు. ఉన్నత సామాజిక వర్గాలలో కూడా అనేక మంది దారిద్య్ర రేఖకు దిగువున్న వారు ఉన్నారు. మరి అలాంటి వారిని గుర్తించి జగన్ ఆర్థిక తోడ్పాటు కల్పిస్తే తప్ప, వీరు శాంతిచే పరిస్థితి లేదు.