https://oktelugu.com/

Abortion Law in US: గర్భస్రావ చట్టంలో మార్పులు.. అమెరికాకు ఇప్పుడు భారత్ ఆశాదీపం

Abortion Law in US: నైలు నది ఉప్పొంగితే నైరోబి దేశానికి కరువు ఉండదు. ఈజిప్ట్ లో ప్రవహించే నైలు నదికి, ఎక్కడో ఉన్న నైరోబి దేశానికి ఏమాత్రం సంబంధం ఉండదు. కానీ ఈజిప్ట్ లో పండే గోధుమలన్నీ ఆ దేశానికి ఎగుమతి అవుతుంటాయి. దీన్నే ఆర్థికశాస్త్రంలో చెప్పాలంటే సప్లయ్ డిమాండ్ సూత్రం అంటారు. ప్రస్తుతం అమెరికాలో గర్భస్రావ చట్టం సమూలంగా మార్పు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. […]

Written By:
  • Rocky
  • , Updated On : June 28, 2022 / 09:02 AM IST
    Follow us on

    Abortion Law in US: నైలు నది ఉప్పొంగితే నైరోబి దేశానికి కరువు ఉండదు. ఈజిప్ట్ లో ప్రవహించే నైలు నదికి, ఎక్కడో ఉన్న నైరోబి దేశానికి ఏమాత్రం సంబంధం ఉండదు. కానీ ఈజిప్ట్ లో పండే గోధుమలన్నీ ఆ దేశానికి ఎగుమతి అవుతుంటాయి. దీన్నే ఆర్థికశాస్త్రంలో చెప్పాలంటే సప్లయ్ డిమాండ్ సూత్రం అంటారు. ప్రస్తుతం అమెరికాలో గర్భస్రావ చట్టం సమూలంగా మార్పు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో అమెరికన్లకు భారత ఆశాదీపం లా కనిపిస్తోంది.

    Abortion Law in US

    గర్భనిరోధక మాత్రలకు డిమాండ్

    అమెరికాలో వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ఎక్కువ. పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో దాదాపు దూరంగా ఉంటారు. విద్య, ఉద్యోగం, వైవాహిక జీవితం అన్ని వారి చేతిలోనే ఉంటాయి. ఇక పెళ్ళి కాక ముందే గర్భం దాల్చడం అనేది అమెరికాలో సర్వసాధారణమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తితే కలిసినంత సులభంగానే విడిపోతారు. అలాంటప్పుడు అవాంచితంగా గర్భం దాల్చిన యువతులు గర్భ స్రావాలు చేయించుకుంటారు. నిన్నా మొన్నటి దాకా కొన్ని రాష్ట్రాలు మినహా మిగతా అమెరికాలో ఎటువంటి ఇబ్బందీ లేదు. మొన్న మిసీసీపీ రాష్ట్రంలో దాఖలు చేసిన కేసు విషయంలో ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు యువతులకు “గర్భ స్రావ ఘాతంగా” పరిణమించింది. దీన్ని చీకటి రోజుగా అభివర్ణించడం తప్ప ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఏమీ చేయలేక పోయారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం కాలర్ ఎగరేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశ యువతులకు భారత్ ఆశాదీపం గా కనిపిస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఉపయోగించే గర్భనిరోధక మాత్రలు భారతదేశం నుంచే ఎగుమతి అవుతాయి. ఎలాగూ ఆసుపత్రిలో గర్భస్రావం చేయరు కాబట్టి ఇక నుంచి యువతులు భారతదేశంలో తయారైన గర్భనిరోధక మాత్రలనే వాడాల్సి ఉంటుంది.

    Also Read: Indian Politicians – Industrialist : నేతలు.. వారి కొత్త రకం బినామీ అవినీతి కథలు

    భారత్ నుంచి ఎగుమతి

    ఫార్మా రంగంలో లో భారత్ ను కొట్టే సత్తా సమీప భవిష్యత్తులో ఏ దేశానికీ లేదు. ముఖ్యంగా మన ఫార్మా కంపెనీలు ఆర్అండ్ డీ కోసం చేస్తున్న ఖర్చుతో 10 ఆఫ్రికా దేశాలను సాకవచ్చు. ఇక దీర్ఘకాలిక రోగాలకు సంబంధించి అమెరికాతో సహా అన్ని దేశాలకు మన దేశంలో తయారైన మందులు సరఫరా అవుతున్నాయి. అంతెందుకు ప్రపంచ ఫార్మా రంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకునే ఎఫ్డిఐ ఇలాంటి సంస్థ ఉన్నా అమెరికా కోవిడ్ నియంత్రణ కోసం వ్యాక్సిన్ ముందుగానే తయారు చేయలేకపోయింది. భారత్ లో కోవి షీల్డ్, కో వ్యాక్సిన్ తయారయ్యే దాకా ప్రపంచానికి ఓ దిశ దశ అంటూ లేకుండా పోయింది. ఆ తర్వాతే భారతదేశం నుంచి వ్యాక్సిన్లు అమెరికాతో సహా వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి.

    Abortion Law in US

    మార్కెట్ పెరగ వచ్చు

    రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోయింది. ఫార్మా రంగంలో విదేశీ సంస్థల పెట్టుబడులతో కంపెనీలు కొత్త కొత్త ప్లాంట్లను తెరుస్తున్నాయి. ముఖ్యంగా రోగాల నివారణకు సరికొత్త మందులను తయారు చేస్తున్నాయి. అమెరికాలో స్వలింగ సంపర్కం, సహజీవనం సాధారణం కాబట్టి గుప్త వ్యాధులతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, క్యాన్సర్, హృద్రోగ బాధితుల సంఖ్య ఎక్కువే. ఇలాంటివారికి భారత్ నుంచే ఔషధాలు ఎగుమతి అవుతాయి. ప్రపంచంలో అన్ని దేశాలకంటే భారత్ మాత్రమే అమెరికాలోని ఎఫ్డీఐ సంస్థ నిబంధనలు కచ్చితంగా పాటిస్తుంది. పైగా రెడ్డీస్ నుంచి ర్యాన్ బాక్సీ వరకు చవకగా మందులు తయారు చేస్తాయి. అమెరికా మన మందులను కొనడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం. మన దేశం నుంచి ఏటా ₹5 వేల కోట్ల విలువైన గర్భ నిరోధక మాత్రలు అమెరికాకు ఎగుమతి అవుతాయి. అయితే అక్కడి సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఎగుమతులు మూడింతలు అయ్యే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు భారత్ రూపీ విలువ జీవిత కాల కనిష్టానికి పడిపోవడంతో ఫార్మా కంపెనీలు కూడా భారీ లాభాలను కళ్ల జూసే అవకాశం ఉంది. ఇక రెడ్డీస్ తయారు చేస్తున్న “ఐ- పిల్” అనే గర్భ నిరోధక మాత్రకు అమెరికాలో డిమాండ్ ఎక్కువగా ఉంది.

    Also Read:Employees Says Goodbye To Jobs: నచ్చితే చేస్తా.. లేకుంటే పోతాం.. కొలువలకు టాటా చెబుతున్న ఉద్యోగులు!

    Tags