Homeఅంతర్జాతీయంChennai To Vladivostok: సముద్ర మార్గాలపై చైనా ఆధిపత్యం.. రష్యాతో కలిసి చెక్‌ పెట్టిన భారత్‌!

Chennai To Vladivostok: సముద్ర మార్గాలపై చైనా ఆధిపత్యం.. రష్యాతో కలిసి చెక్‌ పెట్టిన భారత్‌!

Chennai To Vladivostok: డ్రాగన్‌ కంట్రీ చైనా.. ప్రపంచంలో రెండో సంపన్న దేశం. మొదటి స్థానం సాధించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా దొడ్డిదారులు కూడా అనుసరిస్తోంది. మరోవైపు ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే చైనా సముద్ర వ్యూహాలు – స్ట్రింగ్‌ ఆఫ్‌ పెరల్స్, బెల్ట్‌ అండ్‌ రోడ్‌ వంటి వ్యూహాలు ప్రపంచ సముద్ర మార్గాలపై ఆధిపత్యం సాధించేందుకు ప్రణాళిక రూపొందిచింది. ఇదే సమయంలో భారత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రష్యాతో కలసి చెన్నై నుంచి వ్లాడివోస్టోక్‌ వరకు 5,647 నాటికల్‌ మైళ్ల ఈస్టర్న్‌ మేరిటైమ్‌ కారిడార్‌ (ఈఎంసీ)రూపంలో అందిస్తుంది. ఇది సముద్ర రవాణా మార్గాల్లో ‘గేమ్‌చేంజర్‌‘ అవతుంది.

సమయం, దూరం, ఖర్చు తగ్గింపు..
ముంబై–సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ మార్గం ద్వారా 8,675 నాటికల్‌ మైళ్ల దూరం 35–40 రోజులు పడుతుండగా, చెన్నై–వ్లాడివోస్టోక్‌ మార్గం ద్వారా దూరం 5,647 నాటికల్‌ మైళ్లకు తగ్గి, 20–22 రోజుల్లో ప్రయాణం పూర్తి అవుతుంది. ఇది రవాణా గడువు దాదాపు 12–15 రోజులు తగ్గింపుతోపాటు ఖర్చులలో 20–25% తగ్గింపుని కలిగిస్తుంది.

వ్లాడివోస్టోక్‌లో పుష్కల వనరులు..
రష్యా దక్షిణద్రవ్య భాగం వ్లాడివోస్టోక్‌ నివాస ప్రాంతం ప్రపంచంలో అత్యంత విలువైన వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ ఆయిల్, నేచురల్‌ గ్యాస్, బొగ్గు, టింబర్, అరుదైన ఖనిజాలు, యాపదులు, పరిశ్రమల ముడిసరుకు కోటలు ఉన్నాయి. భారత్‌ ఈ వనరులకు నేరుగా తక్కువ రవాణా వ్యయంతో యాక్సెస్‌ పొందగలదు.

వ్యూహాత్మక, రక్షణ సంబంధాలు..
ఈ సముద్ర మార్గం ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భారత ప్రతిష్ఠ పెంపుకు దోహదపడుతుంది. రష్యాతో రక్షణ రంగంలో కలసి సహకరిస్తూ, నేవల్‌ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి. చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌కు భారత్‌ చెక్‌ పెట్టింది. భవిష్యత్తులో ఆర్కిటిక్‌ సముద్ర రవాణా మార్గం కూడా ఇందులో భాగంగా ఉంటుందని భావిస్తున్నారు.

స్యూయెజ్‌ కాలువలో సవాళ్లు..
స్యూయెజ్‌ కాలువ పైన అంతరాయాలు భారత–ప్రపంచ వాణిజ్యానికి సవాళ్లను సృష్టించాయి. చిన్న ప్రమాదాలు కూడా వాణిజ్య అంతరాయాలు, ఖర్చుల పెరుగుదలను కలిగిస్తాయి. 2021లో ఎవర్‌ గివెన్‌ కంటైనర్‌ షిప్‌ ప్రమాదం వంటి ఘటనలు సామాను సరఫరాకు ముప్పు కలిగించాయి. ఇదే కారణంగా ప్రత్యామ్నాయ సముద్ర మార్గాల అవశ్యకత పెరిగింది. ఈఎంసీ మార్గం దిగుమతులు–ఎగుమతులకు వేగం తెస్తుంది. ఫార్మా, ఐటీ, ఇంజనీరింగ్‌ పరికరాలు, ఆహార వస్తువుల వాణిజ్యం విస్తృతమవుతుంది. దక్షిణాసియా వ్యాప్తంగా ట్రేడ్‌ కనెక్టివిటీ మరింత బలపడుతుంది. చెన్నై ప్రధాన నౌకాశ్రయంగా ఎదుగుతుంది.

చెన్నై–వ్లాడివోస్టోక్‌ సముద్ర మార్గం కేవలం ఒక రవాణా మార్గమే కాదు, ఇది భారతదేశ ఆర్థిక శక్తి, రక్షణ వ్యూహం, భౌగోళిక రాజకీయ ప్రభావాల్లో ప్రధాన పాత్రను పోషించబోతోంది. ఇది దేశ అభివృద్ధికి, ఆవశ్యక భద్రతా మార్గాల్లో మైలురాయిగా నిలుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version