Balayya new film updates: ఒక సినిమాకు ప్రాణం పెట్టి పని చేశామా, డబ్బులు తీసుకున్నామా, వెళ్లిపోయామా, ఆ తర్వాత జరిగే పరిణామాలకు మాకు ఎలాంటి బాధ్యత లేదు అన్నట్టుగా ఉండే హీరోలు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కూడా ఒకరు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 Movie) వాయిదా పడడమే అందుకు ఉదాహరణ అని అంటున్నారు విశ్లేషకులు. బాలయ్య కూటమి పార్టీ కి చెందిన ఎమ్మెల్యే. ఆయన బావ చంద్రబాబు నాయుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. తమ పలుకుబడిని ఉపయోగించి ‘అఖండ 2’ కి ఉన్నటువంటి ఆర్ధిక ఇబ్బందులను తొలగించి చాలా తేలికగా ముందుకు వెళ్లొచ్చు. కానీ బాలయ్య అసలు పట్టించుకోలేదు. ఈ వ్యవహారం లో తనకు ఏమి సంబంధం లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు.
ఉదాహరణకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా ఇలాంటి ఆర్ధిక సమస్యలు చాలానే విడుదల ముందు వచ్చాయి. సినిమా తెరమీద పడేంత వరకు విడుదల అవుతుందనే నమ్మకం అభిమానుల్లో కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని, ఆ చిత్ర నిర్మాత AM రత్నం కి ఉన్నటువంటి ఆర్ధిక సమస్యలను మొత్తం తన భుజాన వేసుకొని, ఆ చిత్రాన్ని విడుదల అయ్యేలా చేసాడు. కానీ బాలయ్య అలాంటివేమీ చేయడం లేదు. సినిమా చేసాను, ప్రొమోషన్స్ లో పాల్గొన్నాను, నా బాధ్యత అక్కడితో అయిపోయింది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య పూర్తిగా ‘అఖండ 2’ మూడ్ నుండి బయటకి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన ద్రుష్టి మొత్తం గోపీచంద్ మలినేని తో చేయబోయే సినిమా మీద మాత్రమే ఉంది. హిస్టారికల్ నేపథ్యం ఉన్న ఈ సినిమా ని బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఏ చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకోనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం బాలయ్య ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం కోసం, మూవీ టీం ఏర్పాటు చేసిన కొన్ని వర్క్ షాప్స్ లో పాల్గొంటున్నాడట. ఇలా గతం లో బాలయ్య ఏ సినిమాకు కూడా చేయలేదు, అలాంటిది ఈ చిత్రం కోసం చేస్తున్నాడంటే, ఆయన ఈ సినిమాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. దీంతో బాలయ్య పూర్తిగా ‘అఖండ 2’ ని లైట్ తీసుకున్నాడని అంటున్నారు నెటిజెన్స్. ఒకవేళ ఆ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించినా కూడా బాలయ్య ప్రొమోషన్స్ లో పాల్గొంటాడా లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.