https://oktelugu.com/

Uttar Pradesh : యూపీలో పేలిన తూటా.. ఖలిస్థానీ ఉగ్రవాదుల కాల్చివేత..!

ఉత్తరప్రదేశ్‌లో చాలా రోజుల తర్వాత మళ్లీ పోలీసుల తూటా పేలింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని, రౌడీషీటర్లను గతంలో యోగి సర్కార్‌ ఎన్‌కౌంటర్‌ చేయించింది. అయితే కోర్టు ఆదేశాలతో కొన్ని రోజులుగా ఎన్‌కౌంటర్లు ఆగిపోయాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 23, 2024 / 01:42 PM IST

    UP Police encounter

    Follow us on

    Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక రౌడీషీటర్ల వెన్నులో వణుకు పుడోతోంది. కొందరు యాక్సిడెంట్లలో మరణిస్తే కొందరు. ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. దీంతో బయట ఉన్న చాలా మంది రౌడీషీటర్లు పోలీసులకు లొంగిపోయారు. బయట ఉండడానికి కూడా భయపడ్డారు. రాష్ట్రం విడిచి పారిపోయారు. ఈ తరుణంలో చాలా రోజుల తర్వాత మళ్లీ యూపీలో పోలీసు తుపాకీలో తూటా పేలింది. అయితే ఈసారి ఈ తూటా ఖలిస్థానీ ఉగ్రవాదులపై గురిపెట్టింది. యూపీ పోలీసులు, పంజాబ్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటన స్థలంలో రెండు ఏకే–47 తుపాకులు, మరో రెండు పిస్టల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ఉగ్రవాదులు గతంలో గురుదాస్‌పూర్‌ పోలీసులపై గ్రెనేడ్‌ విసిరారు. పురాన్‌పూర్‌ ప్రాంతంలో హర్జోయ్‌ బ్రాంచి కెనాల్‌ సమీపంలో సోమవారం(డిసెంబర్‌ 23న) తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

    పక్కా వ్యూహంతో..
    ఉగ్రవాదులు ప్రతాప్‌సింగ్‌(23), వీరేంద్రసింగ్‌(23), గుర్విందర్‌సింగ్‌(20) పంజాబ్‌లోని పోలీసులపై గతంలో గ్రెనేడ్‌ దాడిచేశౠరు. ఈ కేసులో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా వీరు ఉత్తరప్రదేశ్‌లోని ఫిల్‌బిత్‌లోని పురానాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు పక్కా వ్యూహంతో ఉత్తరప్రదేశ్‌ పోలీసులతో కలిసి వ్యూహం రచించారు. సోమవారం వీరిని పట్టుకునేందుకు దాడిచేశారు. అయితే ముగ్గురూ పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఈ ఘటనలో ముగ్గురూ మృతిచెందారు.

    తుపాకుల మోత..
    తెల్లవారక ముందే.. హర్దోయ్‌ బ్రాంచి కెనాల్‌ సమీపంలో తుపాకుల మోతతో సమీప గ్రామాలు ఉలిక్కపడ్డాయి. మళ్లీ ఎవడికో మూడిందని భావించారు. అయితే చాలాసేపు ఎన్‌కౌంటర్‌ కొనసాగడంతో ఆందోళన చెందారు. ఏం జరిగిందో స్థానికులకు అర్థం కాలేదు. చివరకు పురాన్‌పూర్‌ పోలీసులు విషయం తెలిపారు. మృతదేహాలను సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.