Vijay Sethupathi : ఈ ఏడాది ‘మహారాజ’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని, విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న హీరో విజయ్ సేతుపతి. 50 వ చిత్రం గా విడుదలైన ‘మహారాజ’ ఇండియా వైడ్ గా తెలుగు, తమిళ భాషలకు కలిపి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాని, ఇటీవలే చైనా భాషలో దబ్ చేసి విడుదల చేయగా అక్కడ కూడా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది. అంతటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో కలిసి చేసిన ‘విడుదల 2 ‘ చిత్రం ఇటీవలే భారీ అంచనా నడుమ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. గత ఏడాది విడుదలైన ‘విడుదల’ చిత్రానికి ఇది సీక్వెల్. ప్రముఖ కమెడియన్ సూరి ఈ చిత్రం లో హీరో గా నటించగా, విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించాడు.
కానీ పార్ట్ 2 లో మాత్రం విజయ్ సేతుపతి నే హీరో గా నటించాడు. పార్ట్ 1 కి వచ్చిన రేంజ్ పాజిటివ్ రెస్పాన్స్ పార్ట్ 2 కి రాలేదు కానీ, మంచి రివ్యూస్ మాత్రం వచ్చాయి. తమిళం లో భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ దూసుకెళ్తున్న ఈ సినిమా, తెలుగు లో మాత్రం అంతంత మాత్రంగానే వసూళ్లను రాబడుతుంది. మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి కేవలం 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు 45 లక్షలు, మూడవ రోజు 42 లక్షలు రాబట్టింది. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో కోటి 42 లక్షల రూపాయిల గ్రాస్, 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తుంటే అది అసాధ్యం అని అనిపిస్తుంది. కానీ తమిళనాడు లో మాత్రం మంచి వసూళ్లను ఈ సినిమా రాబట్టుకుంటుంది. అక్కడి ట్రేడ్ వర్గాలు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమా మూడు రోజుల్లో 23 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కర్ణాటక లో 2 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి ఈ సినిమాకి 37 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.