https://oktelugu.com/

UP Elections: యూపీ ఎన్నికలు: సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ

UP Elections: ఉత్తరప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికారం కోసం వ్యూహాలు మారుస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పోటీకి సిద్ధమవుతున్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 చోట్ల విజయం సాధించి ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. సమాజ్ వాదీ పార్టీ 47, బహుజన సమాజ్ పార్టీ 19, కాంగ్రెస్ ఏడు చోట్ల మాత్రమే విజయం సాధించాయి. దీంతో ఈసారి కూడా ఇక్కడ గెలుపు తీరాలు చేరుకోవాలని పార్టీలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 13, 2021 / 04:23 PM IST
    Follow us on

    UP Elections: ఉత్తరప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికారం కోసం వ్యూహాలు మారుస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పోటీకి సిద్ధమవుతున్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 చోట్ల విజయం సాధించి ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. సమాజ్ వాదీ పార్టీ 47, బహుజన సమాజ్ పార్టీ 19, కాంగ్రెస్ ఏడు చోట్ల మాత్రమే విజయం సాధించాయి. దీంతో ఈసారి కూడా ఇక్కడ గెలుపు తీరాలు చేరుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి.

    యూపీలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరును సూచించే అవకాశాలున్నాయి. మునిగిపోతున్న పార్టీని గట్టెక్కించాలంటే ప్రియాంకనే ఆధారమని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా విజయం ముంగిట నిలపాలని యోచిస్తోంది. దీనికి గాను ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

    బీజేపీ కూడా దీటైన విధంగా పోటీకి సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో సాధించిన విజయంతో ఎలాగైనా మళ్లీ విక్టరీ సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కాంగ్రెస్ కూడా యూపీలో బీజేపీని ఎదుర్కొని పోటీలో నిలవాలని ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రియాంక గాంధీ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. దీన్ని పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు.

    యూపీలో ప్రాంతీయ పార్టీలు కూడా తమ ప్రభావం చూపించాలని భావిస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ కూడా దీటైన పోటీ ఇవ్వాలని చూస్తున్నాయి. దీంతో యూపీలో చతుర్ముఖ పోటీ ఉండనుందని తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీతో పాటు బీఎస్పీ కూడా రంగంలో దిగనుంది. అయితే సర్వేలు మాత్రం వాటికి అంత ప్రాధాన్యత లేదని చెబుతున్నా ఓటరు నాడి తెలుసుకోవడం కష్టమే.

    బీజేపీకే మొగ్గు చూపుతారని అన్ని సర్వేలు చెబుతున్నా అక్కడ గెలుపు మాదే అని ప్రతిపక్ష పార్టీలు సైతం ఢంకా బజాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు అంత సునాయాసంగా వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఓటమి బారి నుంచి రక్షించుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సీఎం పీఠం అధిరోహించాలని చూస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి.