UP Elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అతిపెద్ద సమస్య మత రాజకీయాలు. అక్కడ హిందువులు, ముస్లింలు రెండుగా చీలిపోయారు. బీజేపీకి కలిసి వచ్చిన రాష్ట్రం యూపీ. అక్కడి హిందుత్వం బీజేపీకే ఓటేశారు. యూపీలో ఈ రెండు వర్గాలను వెంటాడుతున్న సమస్యలు అధిక ధరలు, శాంతిభద్రతలు, రైతులకు మద్దతు ధర, నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది.
ఇవన్నీ ఒక ఎత్తు. యూపీలో ఇప్పుడు అందరికీ నిద్ర లేకుండా చేస్తున్న ఓ సమస్య ఉంది. గత సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆవులను చంపి విపరీతంగా మాంసం అమ్మేవారు. ఎగుమతులు పెద్ద ఎత్తున చేసే వారు.
బీజేపీ ‘గోవధ’ నిషేధంతోనే యూపీలో అధికారంలోకి వచ్చింది. గోవుకు అపకారం చేస్తే భరించలేరు ఉత్తరాది ప్రజలు. ఈ సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో లేదు. అయితే ఇప్పుడు అదే యూపీకి పెను విఘాతమైంది.
యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక గోవధ నిషేధాన్ని పక్కాగా అమలు చేశారు. 11 లక్షల గోవులు ఇప్పుడు యూపీ వీధుల్లో తిరుగుతూ రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ప్రజలు 7 లక్షల గోవులు దత్తత తీసుకొని వాటికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మెయింటేన్ చేస్తోంది.అయితే మిగిలిన 4 లక్షల గోవులు పొలాల మీద పడి తింటూ రైతుల పంటలు నాశనం చేస్తున్నాయి.
రైతులకు నిద్రకరువై ఆవులు దాడి నుంచి కాపాడుకునేందుకు రేయింబవుళ్లు కష్టపడుతున్నారు. గోవధ నిషేధంతో గోవులు ఎక్కువై యూపీకి అతిపెద్ద సమస్యగా మారింది. సమాజ్ వాదీ పార్టీ దీన్ని క్యాష్ చేసుకొని ‘గోవుల’ను నియంత్రిస్తామని ప్రకటించడం ఆ పార్టీకి ప్లస్ గా మారింది. ఇదే ఇప్పుడు యూపీలో అతిపెద్ద సమస్య అయ్యింది. యూపీ ఎన్నికల్లోని అతిపెద్ద ఈ సమస్య ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.