రాహుల్ కు తిరుగులేని ప్రచార అస్త్రాలిచ్చిన మోదీ..!

త్వరలోనే బీహార్లోనే ఎన్నికలు జరుగనున్నాయి. కరోనా టైంలో ఎన్నికలను వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై స్పందించిన కోర్టు కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తేల్చిచెప్పింది. దీంతో ఈసీ ఎన్నికలు నిర్వహించే కొద్దిరోజుల కిందటే నోటిఫికేషన్ ఇవ్వడంతో బీహార్లో ఎన్నికల వేడి రాజుకుంది. బీహార్లో మొదటి విడుదల ఎన్నికల సమయం దగ్గరపడుతుడటంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార.. ప్రతిపక్ష పార్టీల నేతలంతా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ […]

Written By: NARESH, Updated On : October 24, 2020 5:37 pm
Follow us on

త్వరలోనే బీహార్లోనే ఎన్నికలు జరుగనున్నాయి. కరోనా టైంలో ఎన్నికలను వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై స్పందించిన కోర్టు కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తేల్చిచెప్పింది. దీంతో ఈసీ ఎన్నికలు నిర్వహించే కొద్దిరోజుల కిందటే నోటిఫికేషన్ ఇవ్వడంతో బీహార్లో ఎన్నికల వేడి రాజుకుంది.

బీహార్లో మొదటి విడుదల ఎన్నికల సమయం దగ్గరపడుతుడటంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార.. ప్రతిపక్ష పార్టీల నేతలంతా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీకి గట్టి కౌంటర్లు ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు స్థానిక అంశాలపై కాకుండా సైన్యాన్ని బీహార్లో ఎన్నికల్లో లాగుతున్నాయి. రాహుల్ గాంధీ ఓ ప్రచారసభలో గాల్వానా సంఘటన ప్రస్తావిస్తూ మోదీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ మధ్య మోదీ మన భారత భూభాగంలోకి చైనా సైన్యం కూడా చొరబడలేదని చెప్పారన్నారు. ప్రధాని వ్యాఖ్యలు మన సైన్యాన్ని కించపరిచనట్లు ఉన్నాయన్నారు. చైనా సైన్యం భారత భూభాగంలోకి చొరబడకుంటే 20మంది భారత జవాన్లు ఎలా చనిపోయారని ప్రశ్నించారు.

సరిహద్దుల్లో రేయిబవంళ్లు కాపాలా కాస్తున్న సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మోదీ మాట్లాడటం సిగ్గుచేటని రాహుల్ ఫైర్ అయ్యాడు. చైనా సైన్యం మన భూభాగంలోకి 1200కిలోమీటర్లు చొచ్చుకు వచ్చినట్లు తెలిపాడు. మోదీ సైన్యం గురించి మాట్లాడటం మానేసి బీహార్ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

గత ఎన్నికల సమయంలో మోదీ 2కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారో చెప్పాలని మోదీని సూటిగా ప్రశ్నించారు. మోదీ విధానాల కొత్త ఉద్యోగాలేమోగానీ ఉన్న ఉద్యోగాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ కేవలం అంబానీ, అదానీల కోసమే పని చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. బీహార్లో బలమైన ప్రచార అస్త్రాలతో దూసుకెళుతున్న రాహుల్ కు మోదీ ఎలా కౌంటర్ ఇస్తారనేది వేచిచూడాల్సిందే..!